పవన్ వస్తున్నారుగా… ప్రచారం ఫుల్లు..!

Pawan Kalyan UKTA UK Telugu Association, Pawan Kalyan UKTA, Pawan Kalyan UKTA London, Pawan Kalyan UK Telugu Association;ప్రైవేటు కార్యక్రమాలకు చాలా అరుదుగా హాజరయ్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఏదైనా ఒక ఈవెంట్ లో పాల్గొన్నారంటే… దానికి ఎక్కడలేని ప్రచారం లభిస్తుంది. అలాంటి అరుదైన అవకాశమే ‘యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం’ వారికి దక్కింది… అలాగే పవన్ రంగ ప్రవేశం చేయనున్నారన్న వార్తతో ఈ కార్యక్రమానికి మునుపెన్నడూ లేనంత భారీ ప్రచారం కూడా జరుగుతోంది.

‘యునైటెడ్ కింగ్ డమ్ తెలుగు సంఘం’ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 9వ తేదీన ఈస్ట్ లండన్ లోని ట్రాక్సీ ధియేటర్లో జరగనున్న వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాలు పంచుకోనున్నారు. దాదాపు 2000 మంది ఎన్ఆర్ఐ కుటుంబాలు పాల్గొనబోతున్న ఈ కార్యక్రమంలో పవన్ చేత కూచిపూడి కళాకారులను సన్మానించనున్నారు. మొట్టమొదటి సారిగా ఈ కార్యక్రమంలో పవన్ పాల్గొననుండడంతో వేడుకను అట్టహాసంగా నిర్వహించబోతున్నారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories