
వైసీపీలో కొంతమంది ఎప్పుడూ మీడియాలో కనిపిస్తూ లొడలొడా ఏదో మాట్లాడుతూనే ఉంటారు. మరికొందరు నేతలు తక్కువ కనిపిస్తారు. తక్కువ మాట్లాడుతారు.
అటువంటివారిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కూడా ఒకరు. అలాంటి వ్యక్తి కూడా చేత మాట్లాడించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది.
Also Read – తెలుగు సినిమాలకు తెలంగాణ తలుపులు మూసుకుపోయిన్నట్లేనా?
కూటమి ప్రభుత్వం ఇంతకాలం ఆయన భూకబ్జాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించలేదు. కనీసం అటువంటి ఆలోచన కూడా చేయలేదు. కనుకనే ఆయన మాట్లాడలేదు.
ఇప్పుడు జరిపిస్తోంది కనుకనే ఆయన మీడియా ముందుకు వచ్చి సిఎం చంద్రబాబు నాయుడుని, ఆయన ప్రభుత్వాన్ని, పాలనని విమర్శిస్తూ జగన్ భజన మొదలుపెట్టారు. ఒకవేళ ఇప్పుడైనా ప్రభుత్వం భూకబ్జాలపై విచారణ ‘మమ’ అనిపించేసి ముగించేస్తే ఆయన కూడా మళ్ళీ సైలంట్ అయిపోతారు.
Also Read – జగన్‌కి ఓదార్పు కావాలి.. ఎవరైనా ఉన్నారా ప్లీజ్?
మీడియా ఆయన భూకబ్జాలను బయటపెట్టినప్పుడు, ప్రభుత్వం దానిపై విచారణ జరిపిస్తున్నప్పుడు, ఆయన కబ్జాలకు పాల్పడకపోయుంటే ధైర్యంగా స్వాగతించాలి. లేదా తాను అవినీతికి పాల్పడలేదని నిరూపించుకోవాలి.
కానీ ఆయన ఈ వ్యవహారంతో సంబంధం లేని అంశాలు గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.
కరోనా సమయంలో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోనప్పటికీ జగన్ టంచనుగా సంక్షేమ పధకాల సొమ్ము చెల్లించేవారని కానీ చంద్రబాబు నాయుడు చెల్లించకుండా డబ్బు లేదని అబద్దాలు చెపుతున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు.
నాడు కరోనా సమయంలో జగన్ రాష్ట్రంలో ఎక్కడికక్కడ చక్కటి ఏర్పాట్లు చేసి ప్రజలందరినీ ఆదుకున్నారని, అది చూసి ఇరుగు పొరుగు రాష్ట్రాలు కూడా జగన్ ఏవిదంగా ఏర్పాట్లు చేయిస్తున్నారో అడిగి తెలుసుకునేవారని పెద్దిరెడ్డి అన్నారు.
ఒకవేళ సంక్షేమ పధకాలకు జగన్ తన ఆక్రమాస్తులలో నుంచి తీసి ఇస్తే పెద్దిరెడ్డి ఎన్ని గొప్పలు చెప్పుకున్నా అర్దం ఉండేది. కానీ ఎడాపెడా అప్పులు చేసి తెచ్చి డబ్బులు పంచడం కూడా గొప్ప విషయమే అని జగన్ మాత్రమే కాదు వైసీపీలో అందరూ అనుకుంటున్నారని పెద్దిరెడ్డి మాటలతో అర్దమవుతుంది.
కరోనా సమయంలో ఏపీలో సరైన వైద్య చికిత్సలు లభించకపోవడంతో ఎంతోమంది తమ ఆత్మీయుల ప్రాణాలు కాపాడుకునేందుకు అంబులెన్సులలో హైదరాబాద్ తీసుకువెళ్ళేవారు.
ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న కరోనా రోగుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటంతో, కేసీఆర్ తెలంగాణ సరిహద్దుల వద్ద భారీగా పోలీసులను మోహరించి వెనక్కు తిప్పి పంపించేయడం పెద్దిరెడ్డికి తెలియదేమో కానీ ప్రజలకు తెలుసు.
అయినా అటవీ భూములని కబ్జా గురించి కూటమి ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు కరోనా ప్రసక్తి ఇప్పుడెందుకు.. పెద్దిరెడ్డిగారు?