people-returning-to-hyderabad

అప్పుడే కొత్త సంవత్సరంలో 16 రోజులు గిర్రున తిరిగిపోయాయి. చూస్తుండగానే సంక్రాంతి పండుగ హడావుడి కూడా పూర్తయిపోయింది. కనుక మళ్ళీ అందరూ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. హైదరాబాద్‌ నుంచి ఏపీకి వచ్చేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, పెద్ద పండగకి సొంత ఊర్లకు వెళుతున్నామనే సంతోషంలో అవేవీ పెద్దగా బాధించవు.

కానీ ఇన్నిరోజులు ఆత్మీయులతో సరదాగా గడిపిన తర్వాత, మళ్ళీ ఏడాది వరకు రాలేమని బాధపడుతూ హైదరాబాద్‌కి తిరుగు ప్రయాణం అవడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ తప్పదు. హైదరాబాద్‌కి తిరిగివస్తున్న బస్సులు, కార్లు, ఇతర వాహనాలతో విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారి నిండిపోయింది.

Also Read – జగన్‌కి విరుగుడు వారిద్దరే… ఏమవుతుందో?

నగరానికి ప్రవేశద్వారం వంటి యాదాద్రి భువనగిరి జిల్లాలోని పతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటరు పొడవునా వాహనాలు నిలిచిపోయాయి.

గత ఏడాది సంక్రాంతి పండుగకు సుమారు 5 లక్షల మంది హైదరాబాద్‌ నుంచి ఏపీకి వచ్చిన్నట్లు సమాచారం. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా మరో 2 లక్షల మంది ఏపీకి వచ్చి ఉంటారని ట్రాఫిక్ పోలీస్ విభాగం అంచనా వేసింది.

Also Read – ఢిల్లీ బీజేపి ఊడ్చేస్తే తెలంగాణలో కళ్ళాపి తప్పదేమో?

ఏటా ఈ స్థాయిలో హైదరాబాద్‌ నుంచి ఏపీకి ప్రజలు తరలి వస్తున్నారంటే సంతోషమే. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, వరంగల్, ఖమ్మం తదితర ప్రాంతాలలో చాలా మంది స్థిరపడ్డారు. కనుక హైదరాబాద్‌ నుంచి ఏటా వారు ఏపీలో సొంతూర్లకు వచ్చి వెళుతుండటం సాధారణ విషయమే.

కానీ ఏటా సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌ నుంచి ఏపీకి వచ్చిపోయే వారి సంఖ్య ఎందుకు పెరుగుతోంది?అని ఆలోచిస్తే ఏపీలో పరిశ్రమలు, ఐటి కంపెనీలు లేకపోవడం వలన, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక హైదరాబాద్‌కు వలసలు పోవడం వలననే అని చెప్పక తప్పదు.

Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?

ఇది అంగీకరించడం చాలా కష్టమే కానీ ఇదే చేదు నిజం. హైదరాబాద్‌ నుంచి ఏపీకి పండుగకు వచ్చి వెళుతున్నవారిని చూస్తున్నప్పుడు, ఏపీకి ఉపయోగపడాల్సిన వారి మేదస్సు, సేవలను ఉపయోగించుకోలేకపోతున్నామే అని మనసులో బాధ కలుగుతుంది.

కానీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలలలోనే మళ్ళీ ఏపీకి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు తరలివస్తున్నాయి. కనుక మరో రెండు మూడేళ్ళ తర్వాత ఏపీలో కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది.




డాలర్‌తో రూపాయి విలువ లెక్క కట్టుకోవడం కాదు.. రూపాయితో డాలర్ విలువ లెక్కకట్టుకున్నప్పుడే భారత్‌ పూర్తిగా అభివృద్ధి సాధించిన్నట్లని ఓ ప్రముఖ ఆర్ధికవేత్త అన్నారు. అదేవిదంగా ఈ సంక్రాంతి ప్రవాహం ఆంధ్రా నుంచి తెలంగాణవైపు మొదలైనప్పుడే ఏపీ కూడా పూర్తిగా అభివృద్ధి చెందిన్నట్లు భావించవచ్చు.