Pithapuram SVSN Varma Big Heart Towards Alliance Government

పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, బలమైన టీడీపీ నాయకుడిగా, తనదైన రాజకీయాలు చేసిన SVSN వర్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం, కూటమి పొత్తు కోసం తన సీటును త్యాగం చేసారు. తన బలాన్ని జనసేనాని గెలుపు కోసం వెచ్చించారు.

అయితే పార్టీ కోసం, పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం కోసం, పొత్తు ధర్మం కోసం నాడు వెనక్కి తగ్గిన వర్మకు రాజకీయంగా న్యాయం చేసే బాధ్యత నాది అంటూ బాబు, పవన్ ఇద్దరు హామీ ఇచ్చారు. అయినా కూడా ఆ హామీ ఇప్పటికి అమలు సాధ్యం కానీ పరిస్థితులలో ఉంది.

Also Read – పడి లేచిన కెరటం .. జనసేన ..

టీడీపీ తన పార్టీ తరపున ప్రకటించిన మూడు ఎమ్మెల్సీ స్థానంలో SVSN వర్మకు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో పిఠాపురం లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన వర్మ తనకు ఎమ్మెల్సీ దక్కకపోవడం పై స్పందించారు.

ఇప్పటికి చంద్రబాబు, లోకేష్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, టీడీపీ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని, రాజకీయాలలో ప్రజా సేవ చెయ్యడమే గొప్ప పెద్దవిగా భావిస్తానన్నారు. మూడు పార్టీల పొత్తు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పదవుల భర్తీలలో అనేకానేక సమస్యలు, ఇబ్బందులు కలుగుతాయని, ఈ విషయంలో సీఎం బాబు పై ఉండే ఒత్తిడిని అర్ధం చేసుకోవాలంటూ పార్టీ క్యాడర్ కు దిశా నిర్దేశం ఇచ్చారు వర్మ.

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?

అయితే కూటమి తన పట్ల, తన సీటు పట్ల కాస్త అలసత్వం ప్రదర్శించినప్పటికీ, వర్మ చాల పెద్ద మనసుతో అటు పార్టీకి కానీ పార్టీ అధినేతకు గాని ఎటువంటి ఇబ్బంది రాకుండా పార్టీ క్యాడర్ ను సమన్వయ పరచుకుంటూ ముందుకెళ్లడం నిజంగా రాజకీయాలలో హర్షిందగ్గ పరిణామామనే చెప్పాలి.

టీడీపీ పార్టీ పట్ల, ఆ పార్టీ అధినేత చంద్రబాబు పట్ల తనకున్న నిబద్ధతను వర్మ తన మాటలతో చేతలతో పదేపదే నిరూపించుకుంటూనే వస్తున్నారు. ఇటువంటి నాయకుల పట్ల పార్టీ అధిష్టానం కూడా బాధ్యత గా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాజకీయాలలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల కోసం కుటుంబ బంధాలను కూడా తెగతెంపులు చేసుకున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి.

Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!

రాజకీయాలలో తనడిగిన పదవి ఇవ్వకపోయినా, తనకు రావాల్సిన అవకాశం దక్కకపోయినా ఇట్టే పార్టీ కండువాలు మార్చే నాయకులే నేడు దర్శనమిస్తారు. అటువంటి పరిస్థితులలో ఇలా తనకు పదవి ఇవ్వలేదని, తన త్యాగానికి సరైన గుర్తింపు, గౌరవం దక్కలేదని కానీ వర్మ పార్టీ కి వ్యతిరేకంగా, పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి కానీ పల్లెత్తు మాట అనలేదు.




అలాగే తనకు దక్కాల్సిన అవకాశం మరొకరికి దక్కిందని కానీ ఈర్ష్య చూపించలేదు. తనకోసం సీటును త్యాగం చేసిన వర్మ నిబ్బద్దతకు, తన గెలుపు కోసం ఆయన చూపిన తెగువకు వర్మకు సరైన రాజకీయ నాయ్యం చేయాల్సిన బాధ్యత అటు జనసేన అధినేత పవన్ పై కూడా ఉంటుందనే విషయం జనసేన కూడా గ్రహించాలి.