దొంగతనం చేసి పట్టుబడిపోయిన తర్వాత “మీరే దొంగలు, మీ దొంగతం దాచిపుచ్చుకోవడానికే డ్రామాలు, డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారని” ఎవరైనా వాదిస్తే అది ఖచ్చితంగా వైసీపీ, దాని సొంత మీడియాయే అయ్యుంటుంది. దీనికి తాజా ఉదాహరణగా వైసీపీ సొంత మీడియాలో పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పర్యటన గురించి వచ్చిన కదనమే.
కాకినాడ పోర్టు నుంచి గత 5 ఏళ్ళుగా రేషన్ బియ్యం అక్రమంగా ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అవుతోందనే విషయం మంత్రి నాదెండ్ల మనోహర్ బియ్యం బస్తాల సాక్షిగా నిరూపించి చూపారు. మళ్ళీ నిన్న ఆయనతో కలిసి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ పోర్టులో తిరిగి పరిశీలించారు. అప్పటికే నౌకలో విదేశాలకు వెళ్ళిపోతున్న బియ్యాన్ని వెనక్కు రప్పించారు కూడా.
Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్ విధ్వంసానికి…
రేషన్ బియ్యం ప్యాకెట్లను ఇంత నిర్భయంగా, బాహాటంగా పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేయగలిగినప్పుడు, మారణాయుధాలు, మాదక ద్రవ్యాలు రవాణా చేసి ఉండరా?దిగుమతి చేసుకొనే అవకాశం లేదంటారా? అనే పవన్ కళ్యాణ్ ప్రశ్నకు అధికారులు ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు.
కసాబ్ వంటి ఉగ్రవాదులు ఈవిదంగానే ముంబయి నగరంలో ప్రవేశించి మారణ హోమం సృష్టించిన సంగతిని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకొని అటువంటి ప్రమాదం కాకినాడ పోర్టులో కూడా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ తెలుసుకున్న ఈ విషయాలన్నీ నూటికి నూరు శాతం నిజమే అని అర్దమవుతోంది.
Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ పోర్టుని తమ చెప్పు చేతల్లో ఉంచుకొని బియ్యం అక్రమ రవాణా చేశారంటే అర్దం చేసుకోవచ్చు. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన 5 నెలల తర్వాత కూడా ఇంకా ఇంత నిర్భయంగా, బాహాటంగా ఈ దందా కొనసాగుతోందంటే దీనికి వైసీపీ సమాధానం చెప్పుకోలేక తలదించుకోవాలి కదా?
కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలుచేయలేక, రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు అరికట్టలేకపోతుండటంతో పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే పోర్టులో హడావుడి చేశారని వైసీపీ సొంత మీడియా వ్రాసుకొచ్చింది.
Also Read – జగన్ మార్క్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!
పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలోనే ఉంటూ ఈ ప్రభుత్వం తనకు ఎటువంటి సంబంధం లేదన్నట్లు, తాను చాలా నిజాయితీ గల న్యూట్రల్ నాయకుడిని అన్నట్లు బిల్డప్ ఇస్తున్నారని, ఇది ఆయనకు అలవాటే అని ఆక్షేపించింది.
కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు రవాణా అవుతున్న విషయం బయటపడిన తర్వాత కూడా ఇంత నిర్భయంగా ఎదురుదాడి చేస్తూ, తెలివిగా వాదించడం వైసీపీకే చెల్లునేమో?
ఈ సందర్భంగా ఆయన పోర్టు అధికారులను, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలను అందరినీ గట్టిగా నిలదీశారు కూడా. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రినైన తనను పోర్టుకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని, నౌకలోకి ఎక్కి విదేశాలకు ఎగుమతి అవుతున్న బియ్యం బస్తాలను పరిశీలించనీయకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారని పవన్ కళ్యాణ్ చెప్పారు.