ఒకప్పటి బద్ద విరోధితో టీడీపీ మంతనాలు!

Kanna Lakshminarayana -TDP Joiningతెలుగుదేశం పార్టీకి బద్ద విరోదిగా ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కోసం తెలుగుదేశం పార్టీ మంతనాలు జరుపుతుందట. విశాఖపట్నానికి చెందిన ఓ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన ఓ మంత్రి, కొంతమంది గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు కన్నాతో మంతనాలు జరిపారని సమాచారం. ప్రస్తుతం బీజేపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా సమర్పించినట్టు సమాచారం.

ఇప్పటికే వైఎస్సాఆర్ కాంగ్రెస్ లోకి జాయిన్ అవ్వడానికి సిద్ధం కాగా చివరి నిమిషంలో అనారోగ్యం పేరుతో ఆ ప్రయత్నం వాయిదా వేసుకున్నారట. దీనితో టీడీపీ మళ్ళీ ఆయనతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. కాపు సామాజికవర్గంలో పట్టు ఉన్న నేతగా పేరున్న కన్నా లక్ష్మీనారాయణ ను వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వెళ్లకుండా చూడాలని టీడీపీ ప్రయత్నమట.

ADVERTISEMENT

పైగా ఆయన మాజీ మంత్రి, ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి కావడంతో సహజంగానే ఆయన జాయిన్ అయితే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తుంది. దీనితో దానిని ఎలాగైనా అడ్డుకోవాలని ఆయన ప్రయత్నం. మరో వైపు బీజేపీ కూడా ఎలాగైనా ఆయన వెళ్లకుండా చూడాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది.

ADVERTISEMENT
Latest Stories