Narendra Modi

అదేమి విచిత్రమో కానీ వైసీపీ ఏ అంశం భుజానికి ఎత్తుకొని కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తుందో సరిగ్గా దాంతో అదే ఇరుకున పడుతుంటుంది.

ప్రధాని మోడీ చేత విశాఖ సభలో విశాఖ ఉక్కు గురించి సిఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేయించగలరా? అని వైసీపీ సవాలు విసిరింది. విశాఖ ప్రైవేటీకరణ నిలిపించగలరా? నిధులు సమకూర్చగలరా? అంటూ సిఎం చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం కురిపించింది.

Also Read – వైసీపీ వైరస్ కి జైలే వాక్సిన్..?

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ఉక్కు కార్మికులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కనుక వారిని సిఎం చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా రెచ్చగొట్టి మోడీ సభలో ఇరుకున పెట్టాలనుకుంది.

కానీ వైసీపీ అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి. మోడీ ఢిల్లీ తిరిగి వెళ్ళగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కి రూ.11,440 కోట్లు ప్యాకేజీ ప్రకటింపజేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌తో ఆంధ్రా ప్రజలకున్న అనుబందం ఉందని దానిని తాను గౌరవిస్తూ నిధులు విడుదల చేస్తున్నామని ట్వీట్ చేశారు. ఆత్మనిర్భర్ భారత్‌లో విశాఖ ఉక్కు ప్రాముఖ్యతని అర్దం చేసుకున్నామని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కేంద్రమంత్రులు కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆలోచన పక్కన పెట్టిన్నట్లే మాట్లాడారు.

Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?

దీంతో సిఎం చంద్రబాబు నాయుడుని ఇరుకున పెట్టబోయి వైసీపీయే అడ్డంగా చిక్కుకోవడంతో ‘గుడ్డు మంత్రి’ గుడివాడ అమర్నాధ్ నష్ట నివారణ కోసం ‘సొంత మీడియా’ ముందుకు వచ్చి, “జగన్‌ మొదటి నుంచి ప్రైవేటీకరణకి వ్యతిరేకమే. మా ప్రభుత్వం హయంలో చేసిన ఒత్తిడి వల్లనే ప్రైవేటీకరణ నిలిచిపోయింది. దీని కోసం అసెంబ్లీలో మేము చేసి పంపిన తీర్మానమే సాక్ష్యం.

మా వల్లనే ప్రైవేటీకరణ నిలిచిపోయిందని కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా చెప్పారు. అయినా ఈ ప్యాకేజీ విషయం ప్రధాని మోడీ విశాఖ సభలోనే ఎందుకు ప్రకటించలేదు?ఈ ప్యాకేజీ వెనుక మతలబు ఏంటి? కేంద్రం ఇస్తున్న ఈ సొమ్ము అప్పులకే సరిపోతుంది. మరి దీంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ఎలా ఒడ్డున పడుతుంది?” అంటూ నిలదీశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ కాపాడేందుకు టీడీపీ కేంద్రాన్ని కోరుతున్న నాలుగు డిమాండ్స్ కూడా మావే అంటూ వల్లె వేశారు.

Also Read – అమ్మకు ప్రేమతో ఒకరు….అమ్మ మీద ద్వేషంతో మరొకరు…

వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు జగన్‌ వ్యతిరేకమైతే 5 ఏళ్ళలో దానిని కాపాడేందుకు ఏం చేశారు? జగన్‌ హయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రక్రియ జోరుగా సాగుతున్నప్పుడు, దానిని కొని ఆదుకుంటామని కేసీఆర్‌ సింగరేణి అధికారులను వైజాగ్ పంపించారు కదా?తెలంగాణ ప్రభుత్వం కొనగలదని కేసీఆర్‌ అనుకున్నప్పుడు, ఏపీ ప్రభుత్వం కూడా కొనవచ్చని జగన్‌ ఎందుకు అనుకోలేదు?

విధ్వంసం, అరాచకం, అప్పులు తప్ప మరేమీ చేయలేకపోయిన జగన్‌, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే వరుసగా ఇన్ని సాధించి చూపిస్తుంటే మెచ్చుకునేందుకు నోరు రావటం లేదు. అయినా పరవాలేదు. కనీసం మౌనంగా ఉంటే హుందాగా ఉంటుంది కదా?మళ్ళీ ఈ డబ్బా కొట్టుడు దేనికి?ఇంకా నవ్వులపాలవడం దేనికి?