
వైసీపీ నాయకుల అడ్డగోలు రాజకీయాలు వారికీ ఐదేళ్లు తాత్కాలిక ఆనందాన్ని అందించినప్పటికీ చివరికి విషాదాన్నేమిగులుస్తుంది అనేలా ఐదేళ్లు నోటికి నరం లేకుండా వాగిన ప్రతి ఒక్క వైసీపీ అరాచకవాదికి నేడు శిక్షలు ఖరారవుతున్నాయి.
పోలీసులు రావడం కాస్త లేటవ్వచ్చు కానీ కేసులు చుట్టముట్టడం మాత్రం పక్కా…అనేలా ఒక్కో వైసీపీ నేత తమ ఐదేళ్ల నోటి దూలకు కోర్ట్ మెట్లెక్కుతున్నారు. మొన్న వర్రా, బోరుగడ్డ అయితే నిన్న వల్లభనేని, పోసాని వంతు వచ్చింది. ఇక రేపు ఆ బాధితుల లిస్టులో ఎవరు ఉంటారన్నది వారి పాపాల పొద్దు బట్టి ఉంటుంది.
Also Read – కోటరీ రియాక్షన్ లేదేమిటి?
అయితే నాడు జగన్ వీరాభిమానిగా, వైసీపీ విధేయుడిగా చంద్రబాబు, లోకేష్, పవన్ ల మీద వారి కుటుంబ సభ్యుల మీద నోరు పారేసుకున్న పోసాని ఇప్పుడు పాప ఫలితం అనుభవించడానికి సిద్ధమయ్యారు. అయితే వాటి నుంచి విముక్తి పొందడానికి ఎన్ని డ్రామాలాడిన ఫలితం మాత్రం శూన్యం లా కనిపిస్తుంది.
పోసాని అనుచిత వ్యాఖ్యలకు గాను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి దాదాపు 17 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రాజంపేట పోలీసుల అదుపులో ఉన్న పోసాని పై 17 పోలీస్ స్టేషన్ కు సంబంధించిన అధికారులు పీటీ వారెంట్లు సిద్ధం చేస్తున్నారు. దీనితో పోసాని డ్రామా రాజకీయాలకు అధికారులు లొంగరు అనేలా సంకేతాలు ఇచ్చినట్లైయింది.
Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..
అయితే రాజంపేట అధికారుల అండర్ లో ఉన్న పోసాని ని నేడు నర్సారావు పేట పోలీస్ అధికారులకు అప్పగించడం జరిగింది. అప్పుడు సజ్జల డైరెక్షన్ లో జగన్ ను నమ్మి హైద్రాబాద్ లో ఉంటూ నోటికి పని చెప్పిన పోసాని ఇప్పుడు ఏపీ జైళ్ల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అయితే వైసీపీ అరాచకవాదులను వెంటేసుకొస్తూ, వారిని జైలుకెళ్లి మరి పరామర్శిస్తున్న వైసీపీ అధినేత వైస్ జగన్ పోసాని కోసం కూడా మరో మారు జైలు గోడల లోపలికి వెళతారా.?
లేక ఇదంతా సజ్జల గారి డైరెక్షన్ లో వైసీపీలో నిత్యం జరిగే తంతే అంటూ వైసీపీ గుట్టు రట్టు చేసిన నేరానికి పోసానికి జగన్ ఓదార్పు దక్కకుండా పోతుందా.? చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని అవమానించిన వల్లభనేనిని ‘అందగాడు’ అంటూ మెచ్చుకున్న జగన్, మరి పవన్ భార్యను వారి పిల్లలను కించపరిచిన పోసానిని ఏమని ప్రశంసిస్తారో.?