జగన్ సతీమణిపై కేసు నమోదు!

Dhulipalla Narendra fires on jaganగత నాలుగైదు రోజులుగా జగన్ మీడియా ‘సాక్షి’ ప్రచురిస్తున్న కధనాల పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరం ఎంపీ మురళీమోహన్ అయితే ఆ ఆరోపణలను రుజువు చేస్తే… తానూ చావుకైనా రెడీ అన్నారు. అంతలా వేధిస్తున్న కధనాలను ప్రామాణికంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర కేసు నమోదు చేసారు.

“గత 50 సంవత్సరాలుగా రాజకీయాల్లో గౌరవప్రదంగా ఉన్న తమ కుటుంబంపై సాక్షి మీడియా అసత్య కధనాలతో విష ప్రచారం చేస్తోందని, తమ గౌరవానికి భంగం కలిగించిన మీడియాపై న్యాయ పోరాటం చేస్తామని, జగన్ సతీమణి వైయస్ భారతితో సహా సాక్షిలోని 18 మంది డైరెక్టర్ల పై పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ధూళిపాళ్ళ నరేంద్ర ఫిర్యాదు చేసారు. చేసిన తప్పుకు సాక్షి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories