
కూటమి ప్రభుత్వం వైసీపీ పట్ల ఎంత సంయమనం పాటించాలనుకుంటున్నా సోషల్ మీడియాలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌లపై చాలా అనుచితమైన పోస్టులు పెడుతూ రెచ్చగొడుతూనే ఉన్నారు. కనుక కేసుల కొరడా జళిపించక తప్పడం లేదు.
నాలుగైదు నెలల క్రితం ఓసారి ఇలాగే వైసీపీ సోషల్ మీడియా మూకలకు కూటమి ప్రభుత్వం షాక్ ట్రీట్‌మెంట్లు ఇచ్చిన తర్వాత కాస్త దారికొచ్చారు. కానీ మళ్ళీ ఇప్పుడు రెచ్చిపోతున్నారు.
Also Read – జగన్ పొమ్మన్నారు బాబు రమ్మన్నారు.. అశోక్ లేలాండ్‌ని
ఈసారి విశేషమేమిటంటే, ఓ పక్క వైసీపీ నేతలపై వరుసపెట్టి కేసులు నమోదవుతున్నా ‘తగ్గేదేలే’ అంటూ ఇంకా రెచ్చిపోయి పోస్టులు పెడుతున్నారు.
వంశీ, పోసానిల తర్వాత వైసీపీ మాజీ ఎంపీ, గోరంట్ల మాధవ్ వంతు వచ్చింది.
Also Read – కొడాలి నాని అధ్యాయం ప్రారంభం!
డర్టీ పిక్చర్‌తో ఆయన చాలా పాపులర్ అయినప్పటికీ అదే కారణంగా ఎన్నికలలో జగన్ పక్కనపెట్టేశారు. అప్పటి నుంచి ఎలాగైనా జగన్‌ని ప్రసన్నం చేసుకొని వైసీపీలో తన స్థానం పదిలపరుచుకోవాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లపై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆ సందర్భంలో అత్యాచార బాధితుల పేర్లను కూడా బయటపెట్టారు. కనుక విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం సాయంత్రం అనంతపురంలో ఆయన ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చారు. మార్చి 5న ఉదయం 10 గంటలకు సూర్యారావు పేటలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని దానిలో పేర్కొన్నారు.
Also Read – చంద్రబాబు-బిల్ గేట్స్: ఈ ఒక్క ఫోటో చాలు!
నోటీస్ అందుకున్నప్పుడు అందరూ రొటీన్‌గా చెప్పే ‘రాజకీయ కక్ష సాధింపు, అన్యాయం, అక్రమం’ వంటి పదాలతో ముగించేస్తే సరిపోయేది. కానీ గోరంట్ల మాధవ్ ఇలా అరెస్టులు చేసుకుంటూ పోతే రాష్ట్రంలో అంతర్యుద్ధం తప్పదన్నారు. దీనిని ప్రభుత్వం, పోలీసులు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు.
అనంతపురంలో టీడీపీ, జనసేన నేతలు జిల్లా ఎస్పీ జగదీష్‌ని కలిసి గోరంట్ల మాధవ్‌పై పిర్యాదు చేశారు. అంతర్యుద్ధం జరుగుతుందని చెప్పడం ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం లేదా సవాలు చేయడమే కనుక ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని కోరారు.
గోరంట్ల మాధవ్ ఇదివరకు జగన్ మెప్పు కోసమే అత్యుత్సాహంతో నోటికి వచ్చిన్నట్లు మాట్లాడి పోక్సొ సెక్షన్స్ కేసులో చిక్కుకున్నారు.
ఇప్పుడు అంతర్యుద్ధం అంటూ మరోసారి నోరుజారి ఇంకా పెద్ద సమస్యలో చిక్కుకునేలా ఉన్నారు. ఒకవేళ పోలీసులు ఆయన రాజద్రోహం కేసు నమోదు చేస్తే చేజేతులా ఆయన కొత్త సమస్యలను సృష్టించుకున్నట్లే!