మోడల్ కమ్ యాక్ట్రస్ అయిన పూనమ్ పాండే ఎప్పుడు ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటారు. పూనమ్ పాండే సర్వైకల్ కాన్సర్ బారిన పడి చనిపోయారు అంటూ శుక్రవారం నాడు ఆమె వ్యక్తిగత సిబ్బంది సోషల్ మీడియాలో పోస్టు చేసారు. దీనితో చిన్న వయస్సులోనే ఆమె కాన్సర్ తో చనిపోవడం బాధకారం అంటూ సినీ ఇండస్ట్రీ వారితో పాటు అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇటు సోషల్ మీడియాలో కూడా ఆమె మృతి పట్ల సంతాపం తెలియ చేసారు.
అయితే పూనమ్ కుటుంబసభ్యులెవ్వరు ఈ వార్త పై స్పందించకపోవడంతో పలు అనుమానాలు తలెత్తాయి. ఇక అందరి అనుమానాలకు చెక్ పెడుతూ నేను ఎక్కడికి వెళ్లిపోలేదు…బతికే ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసారు పూనమ్. ఈ వీడియోలో పూనమ్ పాండే ను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు.
అయితే ఇదంతా తను కావాలనే చేశానంటూ కారణాన్ని వివరించారు. ఈ రోజులలో చాలామంది స్త్రీలు ఈ సర్వైకల్ కాన్సర్ బారిన పడి చనిపోతున్నారని, దీనిపై అవగాహన తీసుకురావడానికి, ఈ కాన్సర్ పట్ల సమాజం లో చర్చ జరగడం కోసం ఇలా చనిపోయినట్లు పోస్టు పెట్టాను అంతే అంటూ చెప్పుకొచ్చారు.
చెప్పాలనుకుంది మంచి విషయమే అయినప్పటికీ ‘చెప్పే పద్దతి ఇది కాదమ్మా’ పూనం అంటూ వీడియో మీద కామెంట్స్ చేస్తున్నారు. ఇటువంటి పులి కథలు అంత మంచివి కాదంటూ పూనమ్ కు సలహాలు కూడా ఇస్తున్నారు. అయితే ఎప్పుడు ఎదో ఒక వివాదం చేసి వార్తలలో నిలబడాలి అని ఆలోచించే రాంగోపాల్ వర్మ మాత్రం పూనమ్ పోస్టు పై ప్రశంసలు కురిపించారు.
అందరి దృష్టికి ఈ సమస్యను తీసుకురావడానికి మీరు ఎంచుకున్న పద్దతిని కొందరు విమర్శించవచ్చు కానీ ఎవరు దానిని ప్రశ్నించలేరు. మీరు ఎన్నో ఏళ్ళు సంతోషంగా జీవించాలి కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేసారు ఆర్జీవీ. మొత్తానికి పూనమ్ పాండే చేసిన రెండు పోస్టులు సోషల్ మీడియాను మరోసారి షేక్ చేశాయనే చెప్పాలి. సోషల్ మీడియా కింగ్ ఆర్జీవీ అయితే క్వీన్ పూనమ్ పాండే అవుతారేమో.




