
తీగ లాగితే డొంక కదిలినట్లు నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేస్తే తన వెనక అప్పటి వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఉన్నారనే విషయం బయటపెట్టేశారు. సజ్జల ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారామే తాను చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను అసభ్యంగా దూషించానని స్పష్టం చేశారు.
ఆ వీడియోలను సజ్జల కుమారుడు, వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్-షీట్‌లో పేర్కొంది. సజ్జల భార్గవరెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండేవారని అదేదో ఆవేశంతోనో లేదా యధాలాపంగానో మాట్లాడిన మాటలు కావని, ఓ పధకం ప్రకారమే జరిగినవని పోసాని బయట పెట్టేశారు చెప్పేశారు.
Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..
ఈవిదంగా చేయడం తప్పని తెలిసి ఉన్నప్పటికీ సజ్జల రామకృష్ణ రెడ్డి ఆదేశం మేరకు అలా మాట్లాడాల్సి వచ్చిందని పోసాని చెప్పారని పోలీసులు కోర్టుకు సమర్పించిన నేరాంగీకార పత్రంలో పేర్కొన్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు అంటే చాలా ద్వేషం ఉంది. కనుక ఆ ద్వేష భావననే తన పార్టీ విదానంగా మార్చేసుకుని ఆయనని దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తుండేవారు.
Also Read – ఊరిస్తూనే…ఉసురుమనిపిస్తుందే..!
రాజకీయ ప్రత్యర్ధిని రాజకీయంగా శత్రువుగా భావించి రాజకీయంగా ఎదుర్కొని దెబ్బతీయడంవ, లేదా ఎన్నికలలో ఓడించడమో చేస్తే దానిని ఎవరూ ఆక్షేపించరు. కానీ జగన్ అసూయ, ద్వేషాలను పార్టీలో అందరిచేత అమలు చేయించారు. కనుక పోసాని వెనుక సజ్జల, ఆయన వెనుక జగన్ ఉన్నారని చెప్పక తప్పదు.
సజ్జల రామకృష్ణా రెడ్డి, భార్గవరెడ్డి, రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని, వంశీ వంటి వైసీపీ నేతలందరూ రాజకీయాలలో ఉన్నారు కనుక కేసులు, అరెస్టులు, జైలు, బెయిలు వంటి సమస్యలను భరించగలరు.
Also Read – కోటరీ రియాక్షన్ లేదేమిటి?
కానీ సినీ పరిశ్రమకు చెందిన పోసాని, రాంగోపాల్ వర్మ వంటివారికి ఇవన్నీ ఎదుర్కోవడం చాలా కష్టం. కనుకనే ఏపీలో వైసీపీ ఓడిపోయి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‘తప్పయిపోయింది.. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటామని’ చెప్పుకున్నారు.
కానీ చేసినవి పాపాలని, వాటికి మూల్యం చెల్లించక తప్పదని గ్రహించిన పోసాని తనకు ఈ గతి పట్టించి సజ్జల పేరు బయటపెట్టేశారు. చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్‌లను దూషించడం, కులల మద్య చిచ్చుపెట్టేలా మాట్లాడటం వంటివన్నీ ఓ కుట్ర అని చెప్పేసి పోసాని వారినీ ఈ కేసులో ఇరికించేశారు.
ఓ హత్య లేదా దొంగతనం కేసులో ఓ నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఏవిదంగా మిగిలినవారిని పట్టుకునే ప్రయత్నం చేస్తారో, ఈ కేసులో కూడా పోసాని ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు సజ్జలని నోటీసుతో పలకరించినా ఆశ్చర్యం లేదు.