ఎవరి మీదైనా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే ప్రముఖ రచయిత, క్యారెక్టర్ ఆర్టిస్ట్ పోసాని కృష్ణమురళీ, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. “పవన్ కల్యాణ్ గురించి తమకు బాగా తెలుసని, దేశం మీద, ప్రజల మీద ఆయనకు నిజంగా ప్రేమ ఉంటే… అన్నీ వదిలేసి రోడ్డు పైకి రావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ లా పవన్ కూడా పాదయాత్ర చేయాలి, ఊరూరు తిరగాలి. ప్రజలను చైతన్యవంతం చేయాలని” కోరారు.
పవన్ కళ్యాణ్ మంచివాడు, హానెస్ట్ పర్సన్… క్లీన్ మ్యాన్. ఆయన పర్సనల్ లైఫ్ గురించి నేను మాట్లాడట్లేదు. సమాజ పరంగా మాట్లాడుతున్నాను… పద్ధతి గలవాడు. పర్సనల్ లైఫ్ కు, రాజకీయాలకు ముడిపెట్టొదు. రాజకీయాల్లోకి రాక ముందే పవన్ పై నింద పడకూడదనేది నా కోరిక. ఇంకా పరిపూర్ణమైన రాజకీయాల్లోకి రాకముందే, వాళ్లు తిట్టడం… వీళ్లు తిట్టుకోవడం… వేస్ట్ అంటున్నాను. రాజకీయాల్లోకి క్లియర్ గా రావాలనుకుంటున్నప్పుడు అంతే క్లీన్ గా ఉండాలనేది నా కోరిక.
పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టమే. ఈ వన్ ఇయర్, ఆర్నెల్లు… సినిమాలు పక్కన పెట్టి… ట్విట్టర్లు పక్కన పెట్టి… ‘జనసేన’ పార్టీ కండువా కప్పుకుని చంద్రబాబును ఏకి పారేయండి. పవన్ కళ్యాణ్ అనుకుంటున్నట్లు ప్రధాని మోడీ ఏపీకి తీవ్రమైన అన్యాయం ఏమీ చేయలేదు… ప్రత్యేక హోదా విషయమై ఇంకా ప్రజలను ఎందుకు రెచ్చగొట్టడం? చంద్రబాబు వద్దకు వెళ్లి ఏనాడైనా ప్రత్యేక హోదా విషయమై అడిగాడా? అయినా ప్రస్తుతం ఉన్న ముగ్గురి నేతలైన చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ లలో నాకు జగన్ అంటే ఇష్టం’ అని అసలు ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు పోసాని.



