
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి ని గత పది రోజుల కిందట హైద్రాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ పోలీస్ అధికారులు ఆయన పై పలు సెక్షన్ల కింద, పలు నగరాలలో కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అయితే నేడు కర్నూల్ JFCM కోర్ట్ ఆయనకు 20 వేల పూచీకత్తుతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోసాని పై నమోదైన కేసుల నేపథ్యంలో ఆయనకు ఇప్పటికి మూడు కేసులలో బైలు లభించింది. దీనితో రేపు పోసాని జైలు నుండి బైలు పై బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read – అప్పుడు డ్రగ్స్ కేసులు…ఇప్పుడు బెట్టింగ్ కేసులు..!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ముందుకెళ్లిన వైసీపీ నేతలు ఇప్పుడు ఆనాటి పాపాలకు కాను తప్పు చేసిన ప్రతి ఒక్క వైసీపీ నేత జైలు గడప తొక్కే పరిస్థితికి వచ్చారు. బోరుగడ్డ నుంచి పోసాని వరకు ప్రతి ఒక్కరు జైలు గడప తొక్కినవారే.
అయితే ఏపీ ప్రభుత్వం ఈ కేసులపై పూర్తి ఫోకస్ పెట్టలేకపోతుందా.? లేక ఈ కేసులలో అధికారులు బలైమన వాదనలు వినిపించలేకపోతున్నారా.? లేక వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా ఇవి కూటమి కక్ష్య రాజకీయాలలో భాగమా.? అన్నట్టుగా కేసులు..అరెస్టులు..బైలు అనేది ఒక నిరంత ప్రక్రియ కింద కొనసాగుతుంది.
Also Read – ఏపీ ప్రోగ్రాస్ రిపోర్ట్
వైసీపీ ప్రభుత్వంలో, జగన్ ఆధ్వర్యంలో 14 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నఆనాటి మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు ను సైతం వైసీపీ ఎటువంటి ఆధారాలు చూపకుండా అరెస్టు చేసి సుమారు 60 రోజుల పాటు బైలు రాకుండా రాజమండ్రి జైలులో నిర్బంధించగలిగింది.
ఆ సమయంలో బాబు కేసులో విచారణలు వాయిదాల రూపంలో సీరియల్ మాదిరి కొనసాగుతూ వచ్చాయి. కానీ నేడు వైసీపీ చోటామోటా నేతల విషయంలో కూడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇలా అరెస్టవుతున్నారు…అలా బైలు మీద బయటకొచ్చేస్తున్నారు. వీడియో ప్రూఫ్స్ తో సహా పోసాని వాగిన చెత్త వాగుడు ఆధారంగా ఉన్నప్పటికీ ఆయనకు బైలు లభించడం పై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
Also Read – 17 ఏళ్ళ పోరు…ప్రతీకారం తీర్చుకుంటారా.?
ఇక రామ్ గోపాల్ వర్మను ఇప్పటికి ఏపీ అధికారులు చట్టబద్ధంగా నిర్బంధించలేకపోయారు. రోజా, పేర్ని నాని, కొడాలి విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ఇంకా సైలెంట్ గానే ఉంది. ఒక వేల వారి అరెస్టులు జరిగిన అది ఒక ఫార్మాలిటీ కేసు కిందే ఉంటాయన్న బలహీనమైన సంకేతాలు వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వం తన చర్యలతో ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది.
అలాగే బోరుగడ్డ అనిల్ కూడా బైలు మీద బయటకు వచ్చి మరి ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ల పై అనేక ఆరోపణలు చేసారు. జైలుకెళ్లి శిక్ష అనుభవించినప్పటికీ బోరుగడ్డలో తన చర్యల పట్ల ఎటువంటి పచ్చాత్తాపం కనిపించలేదు సరికదా, ఇంకా వైసీపీ మీద జగన్ మీద అదే సైకో ప్రేమ కనపరిచాడు.
ఇప్పుడు బైలు మీద బయటకు రాబోతున్న పోసాని కూడా అనిల్ మాదిరి బయటకు వచ్చి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ పెద్దల పై నిందారోపణలు చేస్తూ జగన్ ను మద్దతు తెలుపుతారా.? లేక సైలెంట్ అవుతారా.?