
పోసాని మంచి నటుడని అనేక సినిమాలలో నిరూపించుకున్నారు. అటువంటి వ్యక్తి గుండెపోటు వచ్చిన్నట్లు నటించలేరా?అందుకే శనివారం రాత్రి రాజంపేట సబ్ జైలులో కెమెరాలు, దర్శకుడు లేకపోయినా ఆ సన్నివేశం రక్తి కట్టించేశారు.
ఆయన నటిస్తున్నారనే సంగతి పోలీసులకు కూడా తెలుసు. కానీ అటువంటి పరిస్థితిలో నిబంధనల ప్రకారం తక్షణం ఆస్పత్రికి తీసుకువెళ్ళి చికిత్స అందించాలి కనుక కడప రిమ్స్ హాస్పిటల్‌కు తీసుకువెళ్ళి అన్ని పరీక్షలు చేయించారు.
Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!
ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని, ముఖ్యంగా గుండెపోటు లక్షణాలు ఏవీ లేవని వైద్యులు తేల్చి చెప్పడంతో మళ్ళీ జైలుకి తరలించాలని రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి స్క్రిప్ట్ ప్రకారమే తాను మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లని బూతులు తిట్టానని పోసాని ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో సజ్జల అండ్ సన్స్ అప్రమత్తమయ్యారు. తండ్రీ కొడుకులు ప్రమాదం శంకించి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేశారు.
Also Read – పడి లేచిన కెరటం .. జనసేన ..
తమ గురించి పోసాని చెప్పింది నిజం కాదని, పోలీసుల ఒత్తిడితోనే ఆయన ఆవిదంగా చెప్పి ఉంటారని కానీ పోసాని ఇచ్చిన ఆ స్టేట్‌మెంట్‌ని సాకుగా చూపి పోలీసులు తమని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారిరువురూ హైకోర్టుని అభ్యర్ధించారు. పోసాని బూతుల వీడియోలతో తమకు ఎటువంటి సంబందమూ లేదని, ఇదంతా తమని ఈ కేసులో ఇరికించేందుకు చేస్తున్న కుట్ర అని సజ్జల అండ్ సన్స్ పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
వైసీపీలో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేస్తే పెద్దగా పట్టించుకోని వైసీపీ నేతలు, పోసానిని అరెస్ట్ చేస్తే ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారో ఇప్పుడు స్పష్టమవుతోంది.
Also Read – జగన్ గుర్తించలేని మెగాస్టార్‌ని బ్రిటన్ గుర్తించింది!
పోలీసులు ఆయనపై చెయ్యి వేయకుండానే సజ్జల అండ్ సన్స్ పేర్లు బయటపెట్టారు. ఒకవేళ కస్టడీలో తీసుకొని గట్టిగా విచారిస్తే మరింకెందరి పేర్లు, ఇంకెన్ని రహస్యాలు బయట పెట్టేస్తారో, పెడితే వైసీపీలో చాలా మంది చిక్కుల్లో పడతామనే ఆందోళన చెందుతున్నట్లున్నారు.
పోసాని స్టేట్‌మెంట్ బయటకు రాగానే సజ్జల అండ్ సన్స్ ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడం ఇందుకు మరో నిదర్శనం. వైసీపీలో మరికొంత మంది ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేసినా ఆశ్చర్యపోనక్కర లేదు.
ఈ భయంతోనే పోసానిని రిమాండ్‌కి పంపించకుండా అడ్డుకునేందుకు వైసీపీ ఆస్థాన న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేశారు. కానీ ఫలించలేదు.
సజ్జల అండ్ సన్స్ ఇప్పుడు అరెస్ట్ భయంతో వణుకుతుంటే, జైల్లో ఉన్న పోసాని పోలీస్ కస్టడీలో ట్రీట్‌మెంట్ ఏవిదంగా ఉంటుందో అని భయపడుతున్నారు. అందుకే ఒకరు కోర్టుకి మరొకరు రిమ్స్ హాస్పిటల్‌కు పరుగులు తీశారని భావించవచ్చు.
ఇలాంటి రోజు ఒకటి వస్తుందని జగన్‌కి ముందే తెలుసు. కానీ ఆయనని నమ్ముకొని చెలరేగిపోయిన ఎవరూ తెలుసుకోలేకపోవడమే ఆశ్చర్యం!