అభిమాని ఫోన్ పగలగొట్టిన ప్రకాష్ రాజ్..!

Prakash-Raj-angry-on-his-fanప్రముఖ తెలుగు సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవ‌ల రెండు వేర్వేరు ఘటనల్లో విలేక‌రులతో గొడ‌వ‌కు దిగి వార్త‌ల్లోకి ఎక్కిన విష‌యం తెలిసిందే. కావేరీ జ‌లాల వివాదం, జల్లికట్టు అంశాల‌పై ప్రశ్నించిన సమయంలో ప్రకాష్ రాజ్ మీడియా ప్ర‌తినిధుల‌కు చివాట్లు పెట్టాడు. తాజాగా త‌న అభిమానిపై కూడా ప్ర‌కాష్ రాజ్ అంత‌క‌న్నా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాడు.

ADVERTISEMENT

చెన్నై విమానాశ్రయంలో ప్రకాష్ రాజ్‌ ను చూసిన ఓ అభిమాని, ఆయ‌న‌తో ఓ సెల్ఫీ తీసుకోవాలని ముచ్చ‌ట‌ప‌డి, అందుకోసం ప్రయత్నించాడు. అయితే ఆ అభిమానిపై తీవ్ర కోపం ప్రదర్శించిన ప్ర‌కాష్‌ రాజ్, ఆ అభిమాని ఫోన్‌ను లాక్కొని నేలకేసి పగలగొట్టాడు. దీంతో ఆ అభిమాని ఇష్టం లేకపోతే వద్దని చెబితే స‌రిపోయేది క‌దా అని మండిప‌డి, వెంట‌నే విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే అప్పటికే ప్రకాష్ రాజ్ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లిపోయాడు.

ADVERTISEMENT
Latest Stories