రాష్ట్రపతి ప్రణబ్ చూడబోతున్న ‘సూపర్ స్టార్’ సినిమా!

Pranab Mukerjee To watch Pinkబాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో… తాప్సీ, ఆండ్రియా తరియంగ్, కీర్తి కుల్హర్ లు ఇతర పాత్రల్లో నటించిన సినిమా ‘పింక్’ విమర్శకుల ప్రశంసలను సైతం ఈ సినిమా అందుకోవడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించింది. పలు అంతర్జాతీయ వేదికలపైనే కాకుండా ,ఐక్యరాజ్యసమితిలో సైతం ఈ సినిమాను ప్రదర్శించారంటే ఏ స్థాయిలో సినిమాను తెరకెక్కించారనేది అర్ధం చేసుకోవచ్చు.

ఆధునిక మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వారిపై చూపుతున్న వివక్ష ఆధారంగా నిర్మాణం జరుపుకున్న ఈ సినిమాను భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీక్షించనున్నారు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. చిత్ర బృందంతో కలిసి ఈ సినిమాను ప్రణబ్ చూడబోతున్నట్టు అమితాబ్ తెలపగా, తాను నటించిన సినిమాను రాష్ట్రపతి చూడనుండటాన్ని అదృష్టంగా భావిస్తున్నానని హీరోయిన్ తాప్సీ చెప్పింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories