ప్రశాంత్ వర్మ: దయచేసి రూమర్స్ స్ప్రెడ్ చెయ్యొద్దు..!

prashant-Varma

హనుమాన్ సినిమా విడుదలకు ముందు నుంచి నిత్యం ఎదో ఒక వార్తతో సినిమా ప్రచారంలోకి వస్తూనే ఉంది. విడుదల సమయంలో అగ్ర హీరోల సినిమాలతో థియేటర్ల ఇష్ష్యు తో మొదలైన రచ్చ మూవీ విడుదలై వసూళ్లు చేస్తున్న కలెక్షన్ల వరకు కొనసాగుతూనే ఉంది.

ADVERTISEMENT

మూవీ విడుదలతో థియేటర్లలో వచ్చిన రెస్పాన్స్ నుంచి ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసారు మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ. తాజాగా ప్రశాంత్ వర్మ పై ఒక వార్త సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంది.

అల్లుఅర్జున్, రామ్ చరణ్ డేట్స్ కోసం చాల రోజులు ఎదురుచూసి తప్పుచేశానంటూ ప్రశాంత్ వర్మ ఒక ఇంటర్ వ్యూ లో మాట్లాడారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. అయితే దీని పై స్పందించిన ప్రశాంత్ చాలా బాగా చెప్పావ్, కానీ నేనెప్పుడూ వారి పేర్లను ప్రస్తావించనే లేదు.

దయచేసి ఇటువంటి రూమర్స్ స్ప్రెడ్ చేయొద్దు, అంటూ తనకు కూడా ఆ హీరోలంటే చాలా అభిమానమని, వారికీ సెట్టయ్యే స్క్రిప్ట్ తో ఎప్పటికైనా వారితో సినిమా తీస్తా అంటూ బదులిచ్చారు. అలాగే హనుమన్ సినిమా ఓటిటీ రిలీజ్ డేట్ పై కూడా ఒక ప్రకటన చేసారు చిత్ర యూనిట్.

జనవరి 12 సంక్రాంతి పండుగ కు ప్రేక్షకుల ముందుకొచ్చిన హనుమాన్ మూవీ ఇప్పటికి థియేటర్లలో తన పవర్ చూపిస్తూనే ఉంది. దీనితో ఆ మూవీ ఓటిటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు 55 రోజుల తరువాతనే మూవీ ఓటిటీ లో అందుబాటులోకి రానుంది అంటూ చిత్ర యూనిట్ ఒక క్లారిటీ ఇచ్చారు. జీ 5 ప్లాట్ ఫామ్ హనుమాన్ ఓటిటీ హక్కులను సొంతం చేసుకుంది. దీనిబట్టి మార్చి మొదటి వారంలో హనుమాన్ బుల్లితెర మీద కూడా ‘హనుమంతు’ పవర్ చూపించడానికి సిద్దమయినట్లే.

ADVERTISEMENT
Latest Stories