వైరల్ : జగన్ – పీకే స్కెచ్?!

Prashant Kishor - YS Jaganరాజకీయ చాణక్యుడిగా కీర్తి గడించిన ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికలలో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రశాంత్ కిషోర్ ను మళ్ళీ వైసీపీ తీసుకువచ్చిందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి విదితమే.

ADVERTISEMENT

ప్రజలలో వైసీపీపై వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న సమాచారంతో ప్రశాంత్ ను రంగంలోకి దించారని మీడియా వర్గాలు కధనాలు ప్రసారం చేసాయి. మరి బరిలోకి దిగిన పీకే వైసీపీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? అంటే… అందుకు వరదలను ఓ అస్త్రంలా చేసుకున్నారని ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలలో సీఎం జగన్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ముఖ్యమంత్రితో ఓ మహిళ మాట్లాడుతూ… వరదలు వస్తున్నాయని తమకు ముందుగా ప్రభుత్వం సమాచారం ఇచ్చినప్పటికీ, ఎప్పుడూ వచ్చే వరదలే కదా అని మేమే నిర్లక్ష్యం వహించామని తప్పంతా తమదేనని చెప్పుకొచ్చింది.

వరదలు వచ్చిన తర్వాత అధికారులు తమకు పూర్తిగా సహకరించి పునరావాసంతో పాటు డబ్బులు కూడా ఇచ్చారని, ఎమ్మెల్యే గారు అయితే వరదల్లో పోయిన గొర్రెల నిమిత్తం 30 వేలు ఇస్తానన్నారని, ఇక్కడే పక్కనుండి మరో స్వరం (గంటలోనే), ఒక్క గంటలోనే ఇస్తామని చెప్పినట్లుగా ముఖ్యమంత్రి గారికి తెలిపారు.

అయితే ఇదంతా జగన్ – పీకే స్ట్రాటజీలో భాగమని… సీఎం గాని, ఎమ్మెల్యేలు గానీ తమకు తాము ఎంత చెప్పినా ప్రజలు విశ్వసించరు గనుక, ప్రజలలోనే ఒకరి చేత చెప్పించి, దీనినే వైసీపీ సొంత మీడియాలో హైలైట్ గా చూపించి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ‘మహాసేన’ రాజేష్ వివరించిన వీడియో నెట్టింట హంగామా చేస్తోంది.

ఈ వీడియోలో వివరించిన విధానంలో లాజిక్ సరిగ్గా ఉండడంతో, తెలుగు తమ్ముళ్ళతో పాటు నెటిజన్లు కూడా వైరల్ చేస్తున్నారు. మరో కొసమెరుపు ఏమిటంటే… కరోనా జాగ్రత్తలతో భాగంగా సీఎం మాస్క్ ధరించలేదు గానీ, సీఎంకు ఎదురు ఉన్నవారంతా మాస్క్ లతో కనిపించడం వెనుక మర్మమేమిటో? ఎవరికైనా అర్ధమవుతోందా!?
https://twitter.com/KazaVk/status/1467156558014386176

ADVERTISEMENT
Latest Stories