ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చేసిన్నట్లే!

andhra-pradesh-elections-2024

సోమవారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజలు లక్షల సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేశారు. చివరికి విదేశాల నుంచి కూడా వేలాదిమంది వచ్చి ఓట్లు వేశారు.

ADVERTISEMENT

ఈ 5 ఏళ్ళుగా వైసీపి పాలనలో నరకం అనుభవిస్తున్న ప్రజలు ఈ ఎన్నికల కోసమే చకోర పక్షుల్లా ఎదురుచూసి, నిన్న తెల్లవారుజాము నుంచే పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చి ఓట్లు వేశారు.

రాష్ట్రంలో పలు ప్రాంతాలలో సోమవారం రాత్రి 11 గంటల వరకు పోలింగ్‌ జరిగింది. అనేక పోలింగ్‌ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్‌ నిలిచిపోయింది. అయినప్పటికీ ప్రజలు ఓపికగా 3-4 గంటలసేపు క్యూలైన్లో నిలబడి ఓట్లు వేశారు.

సాయంత్రం 5 గంటలకు 68.04 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈసారి 80 శాతం కంటే ఎక్కువే నమోదయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెపుతున్నారు.

అనంతపురం, అన్నమయ్య, పల్నాడు జిల్లాలలో చాలా అల్లర్లు జరిగినప్పటికీ ప్రజలు ఏదో కసితో ఓట్లు వేయడానికి వచ్చిన్నట్లు వచ్చి ఓట్లు వేస్తూనే ఉన్నారు.

ఈ అల్లర్లు, దాడులకు టిడిపి, వైసీపిలు పరస్పరం ఆరోపించుకున్నాయి. కానీ పోలింగ్‌ ప్రశాంతంగా జరిగి అత్యధిక శాతం నమోదు అయితేనే కూటమికి లాభం కలుగుతుంది. కనుక అవి అల్లర్లు, విధ్వంసానికి పాల్పడి తమ విజయావకాశాలను చేజేతులా దెబ్బ తీసుకోవాలనుకోవు కదా?

కానీ ఈసారి ఎన్నికలలో దేశవిదేశాల నుంచి కూడా ప్రజలు తరలివచ్చి ఓట్లు వేస్తుండటం, పోలింగ్‌ శాతం 80 దాటే అవకాశం ఉండటంతో వైసీపి ముందే ఓటమిని పసిగట్టి, చివరి ప్రయత్నంగా దాడులకు, ప్రలోబాలకు పూనుకుందని భావించవచ్చు. ఎప్పుడూ ప్రశాంతంగా ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈసారి ఇంత విధ్వంసం, ఇన్ని అల్లర్లు జరగడం చూసి ఇరుగు పొరుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు.

ఈ అల్లర్లు, విధ్వంసం వైసీపి ఓటమిని సూచిస్తుంటే, పెరిగిన పోలింగ్‌ శాతం టిడిపి, జనసేన, బీజేపీల విజయాన్ని సూచిస్తున్నట్లే భావించవచ్చు. సోమవారం కనిపించిన జన ప్రభంజనం వైసీపి కోసమే అని ఆ పార్టీ నేతలు, వారి సొంత మీడియా జూన్ 4న ఫలితాలు వెలువడే వరకు ఎన్ని కధలైనా చెప్పుకోవచ్చు. కానీ జూన్ 4 తర్వాత తమ పరిస్థితి ఏమిటని ఆలోచించుకునే సమయం కూడా ఇదే.

ADVERTISEMENT
Latest Stories