ఇటీవల తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి శాసనసభ సినీ పరిశ్రమ తీరుపై నిప్పులు చెరగగా, వెంటనే అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి ఆయనకు కౌంటర్ ఇచ్చారు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకి ‘దూరం పెరగలేదని’ దిల్‌రాజు చెప్పారు. కనుక నమ్మి తీరాల్సిందే.
అయితే సిఎం రేవంత్ రెడ్డితో సమావేశం జరిగిన తర్వాత, మొన్న విజయవాడలో రామ్ చరణ్ కటవుట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు దిల్‌రాజు మాటలు వేరే భావన కలిగించేలా ఉన్నాయి.
Also Read – అదే వైసీపీ, బిఆర్ఎస్ నేతలకు శ్రీరామ రక్ష!
“సినీ పరిశ్రమకు విజయవాడ పుట్టినిల్లు. కనుక డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో ‘గేమ్ చేంజర్’ ఈవెంట్ ఇక్కడే జరుపుకుందామా మరెక్కడైనా జరుపుకుందామా?అని ఆలోచిస్తున్నాను. పవన్ కళ్యాణ్‌ని కలిసి దీని గురించి మాట్లాడుతానని” దిల్‌రాజు చెప్పారు. తర్వాత కలిశారు కూడా.
విజయవాడ కార్యక్రమం.. దానికి దిల్‌రాజుని ఆహ్వానించడం చాలా రోజుల ముందే ఫిక్స్ అయ్యింది కనుక ఆయన రాకకు హైదరాబాద్‌లో జరిగిన వరుస ఘటనలతో ముడి పెట్టి చూడాల్సిన అవసరం లేదు.
Also Read – వైసీపీ గొంతులో విశాఖ ఉక్కు దిగిందిగా!
పుష్ప-2 సూపర్ డూపర్ హిట్ అయ్యి కలెక్షన్స్ మోత మోగిపోతున్న నేపధ్యంలో గేమ్ చేంజర్ నిర్మాతగా సినిమా ప్రమోషన్స్ చాలా అట్టహాసంగా నిర్వహించాల్సిన అవసరం ఏర్పడింది. గేమ్ చేంజర్ నిజంగానే గేమ్ చేంజర్‌గా నిలవాల్సిన అవసరం ఏర్పడింది కూడా.
కానీ సినీ పెద్దలతో సిఎం రేవంత్ రెడ్డి ఇంత కటినంగా మాట్లాడిన తర్వాత గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలు, టికెట్ ఛార్జీలు పెంచుకోవడం మాట దేవుడెరుగు కనీసం ఈవెంట్‌కి అనుమతి కూడా అడిగే పరిస్థితి కనిపించడం లేదు.
Also Read – ప్రకృతి విపత్తులకు ఎన్‌డీఆర్ఎఫ్, జగన్ విధ్వంసానికి…
బహుశః అందుకే దిల్‌రాజు విజయవాడ, విశాఖ, తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించుకోవాలని భావిస్తున్నట్లున్నారు.
“నేను ఈ కుర్చీలో కూర్చొని ఉండగా…” అంటూ సిఎం రేవంత్ రెడ్డి చేసిన శపధం సినీ పరిశ్రమ పాలిట శాపంగానే భావించవచ్చు. కనుక తెలుగు సినీ పరిశ్రమని పుట్టిల్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఆదుకోవలసి ఉంటుంది.
స్వర్గీయ నందమూరి రామారావు సినీ పరిశ్రమని మద్రాస్ నుంచి హైదరాబాద్‌కి తీసుకువచచ్చి ఆత్మగౌరవం కల్పించారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పుట్టింటికి (ఏపీకి) తరలిరావాలని, సగౌరవంగా చూసుకుంటామని సిఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నారు. పర్యాటక రంగానికి ఏవిదంగా ‘పరిశ్రమ హోదా’ ఇస్తున్నామో ఆదేవిదంగా సినీ రంగానికి కూడా పరిశ్రమ హోదా ఇస్తామని పవన్ కళ్యాణ్ చెప్పారు.
తెలంగాణలో సినీ పరిశ్రమ పట్ల నెలకొన్న ఈ వ్యతిరేకత, వేడి ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. కానీ అమెరికాలో స్థిరపడిన విదేశీయులకు గ్రీన్ కార్డ్ లభించినప్పటికీ వారిని ఎప్పటికీ విదేశీయులుగానే చూస్తున్నట్లే, తెలంగాణలో తెలుగు సినీ పరిశ్రమని కూడా ఆంధ్రాకు చెందినదిగానే చూస్తుంటారు.
ముఖ్యంగా ఇటువంటి కొన్ని అనూహ్యమైన పరిణామాలు జరిగినప్పుడు సినీ పరిశ్రమలో ఈ ‘పరాయితనం’ మరింత స్పష్టంగా కనిపిస్తుంటుంది. దిల్‌రాజు తెలంగాణకు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఆయన నోట అప్రయత్నంగా ఈ మాట వచ్చింది.
కనుక అమెరికాలో గ్రీన్ కార్డ్ కంటే స్వదేశంలో తెల్ల రేషన్ కార్డే మిన్న అనుకుంటే సినీ పరిశ్రమ మెల్లగా పుట్టింటికి బయలుదేరే ప్రయత్నాలు చేయడమే మంచిది.