చంద్రబాబుపై సీబీఐ విచారణ చేయించారా? చేయించలేరా?

Purandeswari  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీబీఐ విచారణ జరిపించడం తమ పార్టీకి ఇష్టం లేదని బీజేపీ మహిళామోర్చా జాతీయ ఇన్‌చార్జి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కక్షతో సీబీఐ దాడులు చేయించే సంస్కృతి బీజేపీది కాదని అందుకే ఆ ఆలోచన లేదని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.

ADVERTISEMENT

పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ 1600 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసిందని పేర్కొన్నారు. ఆ లెక్కలు అడుగుతుంటే చం‍ద్రబాబు చెప్పడం లేదని విమర్శించారు. ఒకవేళ పురంధేశ్వరి చేస్తున్న ఆరోపణ నిజమే అయితే సీబీఐ విచారణ చెయ్యడం కేంద్రం బాధ్యత కదా? అలా చెయ్యకపోవడం కూడా తప్పే కదా?

లేక వారు చేస్తున్న ఆరోపణలలో పసలేదు కాబట్టే ఇలా తప్పించుకుంటున్నారా? పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం నయా పైసా మంజూరు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పోలవరం జాతీయ ప్రాజెక్టు కాదు కాబట్టి నిధులు ఇవ్వలేదు. అయినా ఆ సమయంలో పురంధేశ్వరికి ప్రభుత్వంలోనే ఉన్నారుగా. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మించి నిధులు ఇచ్చామని ఆమె పేర్కొన్నారు.

ADVERTISEMENT
Latest Stories