జగన్ మహిమ… అందంగా చూపించడంలో దిట్ట..!

Puri Jagannadh Rougue heroine Stillsతెలుగు సినీ పరిశ్రమకు చాలామంది హీరోయిన్లను పరిచయం చేసిన ఘనత పూరీ జగన్నాధ్ ది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎలాంటి పవర్ ఫుల్ పాత్రకైనా కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అనుష్క, పూరీ ‘సూపర్’ సినిమా నుండి వచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్లను ఎంతో అందంగా చూపించడంలో పూరీ శైలే వేరు. పూరీ సినిమాలలో అందంగా కనిపించిన ముద్దుగుమ్మలు, ఆ తర్వాత సినిమాలలో ఆ రేంజ్ లో కనిపించకపోతుండడంతో, వారికి అవకాశాలు కనుమరుగవ్వడం రొటీన్ గా జరిగే ప్రక్రియగా మారింది.

అయితే, రొటీన్ కు భిన్నంగా ఇప్పటికే రెండు సినిమాలలో కనిపించి, టాలీవుడ్ ప్రేక్షకులను నిరాశపరిచిన మన్నారా చోప్రాను పూరీ తన తాజా సినిమా “రోగ్”లో హీరోయిన్ గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన స్టిల్స్ విడుదల చేసారు. ఇంతకుముందు సినిమాలలో నటించింది ఈమేనా? అనే స్థాయిలో పూరీ తన కెమెరాలలో బంధించారని చెప్పవచ్చు. బ్లాక్ డ్రెస్ లో మిలమిల మెరుస్తూ చూపిస్తున్న సోయగాలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. బహుశా ఈ సినిమాతో మన్నారా దశ తిరగడం ఖాయమేమో..!

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories