Raghu Rama Krishna Raju

విజయసాయి రెడ్డి ఆకస్మిక రాజీనామాతో వైసీపీలో ప్రకంపనలు మొదలైతే, ఏపీ డెప్యూటీ స్పీకర్, ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు నేడు మరో బాంబు పేల్చారు. ఆనాడు దేశద్రోహం కేసులో విచారణ పేరిట కస్టడీలో తనని చిత్ర హింసలు పెట్టిన పోలీస్ అధికారులను గుర్తించారు.

ఇందుకోసం గుంటూరు జిల్లా న్యాయమూర్తి ఎదుట మరికొంత మంది పోలీస్ అధికారులతో కలిపి వారిని నిలబెట్టగా ఆయన వారందరినీ పేరుపేరునా గుర్తించారు. వారిలో ఒకరు మొహం కనిపించకుండా కర్చీఫ్ కట్టుకొని వచ్చినప్పటికీ తనని చిత్ర హింసలు పెడుతున్నప్పుడు అది జారిపోవడంతో ఆ అధికారిని గుర్తు పట్టానని చెప్పారు. మిగిలినవారి గొంతులు, ఆకారాలను బట్టి గుర్తుపట్టానని చెప్పారు.

Also Read – జగన్‌ 2.0 కోసం కార్యకర్తలు జైళ్ళకి వెళ్ళాలా?

ఆనాడు రఘురామ కృష్ణరాజు వైసీపీ ఎంపీగా ఉన్నప్పుడు జగన్‌తో విభేదించి బయటకు వచ్చేసి విమర్శిస్తుండటంతో, జగన్‌ ఆదేశం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆయనని చిత్రహింసలు పెట్టారు.

ఆ సమయంలో ఓ పోలీస్ అధికారి రఘురామ కృష్ణరాజు గుండెలపై కూర్చొని చెంపలు వాయించారని, మరొకరు అరికాళ్ళు వాచిపోయేలా లాఠీతో కొట్టారని, మరో పోలీస్ అధికారి ఆ చిత్రహింసలని తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరిస్తుంటే తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చున్న జగన్‌ అది చూసి ఆనందిస్తూ ఇంకా గట్టిగా కొట్టమని చెప్పారని రఘురామ కృష్ణరాజు స్వయంగా చెప్పారు. ఆ భయంతోనే రఘురామ కృష్ణరాజు నాలుగేళ్ళు ఢిల్లీలోనే ఉండిపోయారు కూడా.

Also Read – జగన్‌ 2.0: ఏపీకి, చంద్రబాబుకి మరింత కష్టమే!

నాడు జగన్‌ అధికారంలో ఉన్నారు. సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బులు పంచిపెడుతున్నాను కనుక మళ్ళీ తానే అధికారంలోకి వస్తానని గట్టి నమ్మకంతో ఉండేవారు. కనుక తాను ఏమి చేసిన చెల్లుతుందని అనుకునేవారు. అందుకే రఘురామ అరికాళ్ళు వాచిపోయాయి.

కానీ ఎన్నికలలో వైసీపీ ఓడిపోయి ఆయన అధికారం కోల్పోవడంతో ఇప్పుడు పరిస్థితులు తారుమారు అయ్యాయి. ఆనాడు రఘురామ కృష్ణరాజు పిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులే నేడు కేసు నమోదు చేసి ఆయనని చిత్ర హింసలు పెట్టినవారిపై కేసు నమోదు చేశారు కూడా.

Also Read – తండేల్ కాంబోస్..!

ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్ పాల్‌ని పోలీసులు అరెస్టు చేసి ప్రశ్నించారు. ఇప్పుడు మిగిలినవారిని కూడా రఘురామ కృష్ణరాజు గుర్తించారు కనుక ఆరోజు వారు అలా ఎందుకు చేశారో?ఎవరి ఆదేశాలతో చేశారో నోరు విప్పి చెప్పక తప్పదు.




లేకుంటే ఓ ఎంపీని చిత్రహింసలు పెట్టిన నేరానికి వారే పూర్తి బాధ్యత వహించి జైలుకు పోవాల్సి ఉంటుంది. కనుక విజయసాయి రెడ్డి కధతో పాటు ఈ కధ కూడా క్లైమాక్స్‌కి వచ్చేసిన్నట్లే. జస్ట్ వారు నోరు విప్పితే చాలు!