చిరంజీవికి చీకటి పర్యటనలు చెయ్యాల్సిన అవసరం ఏముంది?

Raghuveera Reddy about chiranjeevi rahul gandhi secret meetఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీని ఢిల్లీలో కలిశారు. ఆ మీటింగ్ తరువాత మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్య చేసారు. చిరంజీవి ఇప్పటికి కాంగ్రెస్ లోనే ఉన్నారని, రెండు రోజుల క్రితమే రాహుల్ ను కలిసి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన సంధర్భంగా విషెస్ తెలిపారని రఘువీరా అన్నారు.

అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే.. చిరంజీవి రాహుల్ గాంధీని అంత రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముంది? కలిసిన తరువాత కూడా రఘువీరా చెప్పేవరకూ దానిగురించి మీడియాకు చెప్పకపోవడం ఏంటి? ఆ మీటింగ్ కు సంబంధించిన ఒక ఫోటో కూడా బయటకు రాకపోవడం ఏంటో?

ADVERTISEMENT

చిరంజీవి పార్టీ వ్యవహారాల్లో ఎందుకు యాక్టీవ్ గా లేరు అని అడిగితే ఆయన 150వ సినిమా కాంగ్రెస్ హై కమాండ్ పర్మిషన్ తీసుకున్నారని, ఇప్పుడు 151వ సినిమాలో బిజీగా ఉన్నారని అది అయ్యాక పార్టీలో క్రియాశీలంగా ఉంటారని చెప్పుకొచ్చారు. 151వ సినిమా తరువాత 152వ సినిమా ఉంటుంది కదా?

ADVERTISEMENT
Latest Stories