rahul-gandhi about BJP Coverts in Congress Party

ఏపీలో కాంగ్రెస్‌ ఉనికి పెద్దగా లేదు కనుక దాంతో ఏ పార్టీకి ఇబ్బంది లేదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. కనుక బీజేపి, బిఆర్ఎస్ పార్టీలు దానిని తీవ్రంగా విమర్శిస్తుంటాయి. ముఖ్యంగా ఏవైనా ఎన్నికలొస్తే కాంగ్రెస్, బీజేపిలు కుమక్కయ్యాయని బిఆర్ఎస్ పార్టీ, దాంతోనే కుమ్మకుయ్యిందని బీజేపి పరస్పరం ఆరోపించుకుంటాయి.

బిఆర్ఎస్ పార్టీ నేతలు మరో అడుగు ముందుకేసి ఏదో రోజు సిఎం రేవంత్ రెడ్డి బీజేపిలో చేరిపోవడం ఖాయమని జోస్యం చెపుతున్నారు కూడా.

Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!

ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్‌ యువరాజు రాహుల్ గాంధీ, (గుజరాత్) కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బీజేపితో అంటకాగుతున్నారని, వారికి ప్రజలు, పార్టీ అవసరం లేదని, బీజేపితో టచ్చులో ఉంటే మంచిదనే భావనతో ఉన్నారన్నారు.

కనుక గుజరాత్ ప్రజలను కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయమని అడిగే ముందు పార్టీలో బీజేపి కోవర్టులందరినీ గుర్తించి ఏరి పారేయాల్సి ఉంటుందని రాహుల్ గాంధీ అన్నారు.

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?

గుజరాత్ రాష్ట్రంలో దాదాపు రెండు దశాబ్ధాలుగా బీజేపి అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎంతగా ప్రయత్నించినా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రాలేకపోతోంది. ఇన్నేళ్ళపాటు, ప్రతిపక్షంలో కూర్చొని కాలక్షేపం చేస్తే, రాజకీయ నాయకుల మనుగడ చాలా కష్టమవుతుంది.

ప్రజలు కూడా అటువంటివారిని క్రమంగా మరిచిపోతారు. కనుక ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధికారంలో ఉన్న బీజేపితో కాంగ్రెస్‌ రాజకీయ నిరుద్యోగులు చేతులు కలుపక తప్పదు.

Also Read – ఇవి కదా… సంస్కరణలంటే?

కానీ బీజేపితో కాంగ్రెస్‌ నేతల బందం ఇలాగే కొనసాగనిస్తే, ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మూతపడుతుంది. అందుకే రాహుల్ గాంధీ ఈవిదంగా హెచ్చరించి ఉండొచ్చు.

ఆయన గుజరాత్ కాంగ్రెస్‌ నేతలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నేతలు, కాంగ్రెస్‌, బీజేపిల మద్య రహస్య అవగాహన ఉందనే తమ వాదనలు నిజమేనని స్వయంగా రాహుల్ గాంధీ ధ్రువీకరించారని చెప్పుకోకుండా ఉండరు.




అంటే రాహుల్ గాంధీ గుజరాత్‌ కాంగ్రెస్‌కు మందు వేస్తే, తెలంగాణ కాంగ్రెస్‌కు మంట మొదలవుతుందన్న మాట! మరి ఈ విషయం రాహుల్ గాంధీ ఆలోచించలేదా?