తెలంగాణలో కాంగ్రెస్ ను అదికారంలోకి తీసుకురావాలన్న ప్రయత్నంలో భాగంగా ఎఐసిసి అద్యక్షుడు రాహుల్ గాందీ ఇకపై ప్రతి నెల తెలంగాణకు వస్తారని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఈనెల 13, 14 తేదీల్లో జరిగే రాష్ట్ర పర్యటనలో ఆయన అన్ని వర్గాలతో మమేకమవుతారని తెలుస్తుంది.
[m9ad]
ఈసారి పర్యటనలో కాంగ్రెస్ కేడర్‌తో పాటు మహిళలు, సెటిలర్లు, ఎడిటర్లు, యువపారిశ్రామికవేత్తలు, ముస్లిం మేధావులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారు. దక్షిణాదిన కర్ణాటక తరువాత కాంగ్రెస్ ఎంతో కొంత అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ బాగా రాణిస్తే అది జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ కు సాయపడుతుంది.
కావున తెలంగాణపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు రాహుల్. అయితే కేసీఆర్ రూపంలో అత్యంత బలమైన ప్రత్యర్థి ఉండటంతో కాంగ్రెస్ తెలంగాణను తేలికగా తీసుకోబోవడం లేదు. గతంలో పార్టీని విలీనం చేస్తామని కాంగ్రెస్ కు చెప్పి మోసం చేశారని కాంగ్రెస్ పెద్దలలో బలంగా ఉంది. కావున వారు తమ సర్వశక్తులు ఒడ్డటానికి సిద్ధం అవుతున్నారు.



