రాహుల్ గాంధీ నిద్ర వెనుక ఉన్న అసలు “రహస్యం”

Rahul Gandhi, Rahul Gandhi Sleeping,  MP Rahul Gandhi Sleeping, Rahul Gandhi Sleeping Lok Sabha, Rahul Gandhi Sleeping Parliament, Congress MP Rahul Gandhi Sleepingకాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ‘బుధవారం’ గ్రహణం పట్టుకుంది. బుధవారం వచ్చిందంటే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడికి నిద్ర ఆగడం లేదు. నిజంగానా అంటే నిజంగా అనే చెప్పాలి… 2014, 2015, 2016 సంవత్సరాలలో వరుసగా చోటుచేసుకున్న ఘటనలను పరిశీలిస్తే ఈ విషయం నిజమేనని నమ్మి తీరాల్సిందే. తమ కుటుంబ సొంత నియోజకవర్గంగా భావిస్తున్న అమేధీ నుంచి రాహుల్ గాంధీ లోక్ సభకు ఎన్నికవుతూ వస్తున్నారు.

ADVERTISEMENT

పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఉంటే తప్పనిసరిగా సభకు హాజరవుతున్న రాహుల్ గాంధీ… పలు సందర్శాల్లో ఆయా అంశాలపై జరిగిన చర్చల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు. పలు సందర్భాల్లో అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేసారు కూడా! అయితే 2014, 2015, 2016 ఏడాదుల్లో (నిన్న) పార్లమెంట్ లోనే ఓ కునుకేశారు.

ఈ మూడు సందర్భాలను పరిశీలిస్తే… రాహుల్ గాంధీ కునుకు తీసిన రోజు బుధవారమే అని తేలడం విశేషం. ఈ మేరకు మూడేళ్ల పాటు సభలో రాహుల్ కునుకుపాట్లకు సంబంధించి పలు జాతీయ, ప్రాంతీయ పత్రికలు తమ సంచికల్లో ఆసక్తికర కథనాలను ప్రచురితం చేసాయి. అంటే బుధవారం వచ్చిందంటే బాబు గారు నిద్రావస్థలోకి జారుకోవాల్సిందేనన్న మాట.

ADVERTISEMENT
Latest Stories