హల్వా అంతా మీరే తినేస్తారా… అన్యాయం!

Rahul Gandhii

కాంగ్రెస్‌ యువరాజు, ఎంపీ రాహుల్ గాంధీ ప్రస్తుతం లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కనుక ప్రతిపక్షాలు, దేశ ప్రజల తరపున ఆయన సభలో మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ దేశంలో సామాన్య ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. కానీ ఆయన తాను చాలా తెలివిగా మాట్లాడుతున్నానుకుంటూ ఏదో ఓ పాయింట్ పట్టుకొని మాట్లాడి తరచూ నవ్వుల పాలవుతుంటారు.

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టే ముందు హల్వా తయారుచేసే వేడుక ఓ ఆనవాయితీ. దానిలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆర్ధిక శాఖ అధికారులు, కేంద్ర మంత్రులు పాల్గొంటారు. ఏదైనా శుభవార్త వింటే నోరు తీపి చేయడం అంటారు. ఆలాగే ఇదీను. బడ్జెట్‌తో దేశానికి మేలు కలుగుతుందనే సూచనగా కేంద్ర ప్రభుత్వం ఈ వేడుకని చేస్తుంది తప్ప అంతకు మించి ప్రాధాన్యం ఏమీ లేదు.

ADVERTISEMENT

అయితే రాహుల్ గాంధీ లోక్‌సభ సమావేశంలో ఆ ‘హల్వా వేడుక’ ఫోటోని ప్రదర్శిస్తూ, “దేశ ప్రజలందరూ హల్వా కోసం ఎదురుచూస్తుంటే మీరు తయారు చేసిన హల్వాని ఎవరికీ పెట్టకుండా మీరందరూ పంచుకొని తినేశారు… ఆ కార్యక్రమంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక్క అధికారి కూడా లేరు,” అంటూ ఆవేశం అంటుంటే, కాంగ్రెస్‌, మిత్రపక్షాల సభ్యులతో సహా సభలో అందరూ ఫక్కున నవ్వారు.

ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ అయితే రాహుల్ గాంధీ మాటలు విని నవ్వాపుకోలేక రెండు చేతులతో మొహం కప్పుకున్నారు.

కేంద్ర బడ్జెట్‌లో బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి తగినంత నిధులు కేటాయించలేదేమీ?అని రాహుల్ గాంధీ అడగాలనుకున్నట్లు అర్దమవుతూనే ఉంది. కానీ ఆయన నేరుగా ఆ లెక్కలు బయటకు తీసి కేంద్రాన్ని నిలదీసే బదులు హల్వా వండుకొని ఎవరికీ పెట్టకుండా మీరందరూ తినేశారని నిలదీసి నవ్వులపాలయ్యారు.

ADVERTISEMENT
Latest Stories