తెలుగు రాష్ట్రాలలో రాహుల్ గాంధీ టూర్

Rahul gandhi tour in telangana and Andhra Pradeshకాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండు తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించారు. ఇప్పటికే ఆయన తెలంగాణ టూర్ ఖరారైంది. ఈ నెల 13, 14 తేదీల్లో రాహుల్ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముఖ్యంగా కాంగ్రెస్ నేతలతో సమావేశమై.. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.

ADVERTISEMENT

[m9ad]

అనంతరం రంగారెడ్డి జిల్లాలో జరిగే బస్సు యాత్రలో రాహుల్ పాల్గొననున్నారు. మరోవైపు ఆయన ఈ నెల 18న కర్నూల్ లో ఒక భారీ బహిరంగ సభకు హాజరవుతారని సమాచారం. సభ తేదీ ఖరారు కానప్పటికీ ఈ నెలలోనే రాహుల్ గాంధీ రాష్ట్రానికి రాబోతున్నట్టు సమాచారం. ఒకప్పుడు ఇక్కడ పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు డోలాయమాన స్థితిలో ఉంది.

ఆంధ్రప్రదేశ్ లో గత ఎన్నికలలో ఒక్క సీటు రాలేదు. తెలంగాణాలో మాత్రం ముక్కుతూ మూలుగుతూ ఎలాగో ప్రధాన ప్రతిపక్ష హోదా సంపాదించగల్గింది. 2019 ఎన్నికలలో పార్టీ భాగ్య రేఖలు మార్చాలని రాహుల్ గాంధీ సంకల్పించారు. చూడాలి ఇది ఎంత వరకు ఉపయోగపడుతుందో!

ADVERTISEMENT
Latest Stories