మన దేశ నిర్మాణాల నాణ్యతకు సజీవ సాక్ష్యంగా ఈ ఫోటో నిలుస్తోందని చెప్పవచ్చు. మహారాష్ట్రలోని రాయ్ గడ్ ఫోర్ట్ కు సంబంధించిన మెట్ల కధ ఇది. 1656వ సంవత్సరంలో ఛత్రపతి శివాజీ నిర్మించిన మెట్లు ఒక భాగంలో ఉండగా, 2013లో మహారాష్ట్ర సర్కార్ కట్టించిన మెట్లు మరో భాగంలో స్పష్టంగా చూడవచ్చు.
దాదాపుగా 1,31,400 రోజుల (360 సంవత్సరాల) క్రితం ఛత్రపతి శివాజీ నిర్మించిన మెట్లు చెక్కు చెదరకుండా అలాగే ఉండగా, కేవలం ఓ 1000 రోజుల (3 సంవత్సరాల) క్రితం మహారాష్ట్ర సర్కార్ నిర్మించిన మెట్ల దుస్థితిని చూసి నవ్వుకోవడం నెటిజన్ల వంతవుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభిస్తోంది.
ఆప్ నేత ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ఫోటోకు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాలలో వేల సంఖ్యలో లైక్ లు, షేర్ లు వస్తున్నాయి. ఒకటి మనదేశ పురాతన చరిత్ర గొప్పతనాన్ని చాటుతుంటే… మరొకటి ప్రస్తుత దేశ దుస్థితిని చాటిచెప్తోంది.



