2019లో తన పెళ్లి అని చెప్పిన టాలీవుడ్ యువహీరో!

Raj Tarun announces his  marriage plans‘ఉయ్యాల జంపాలా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి సూప‌ర్ స‌క్సెస్ అందుకున్న హీరో రాజ్ త‌రుణ్ ఆ త‌రువాత తీసిన ‘సినిమా చూపిస్తా మావ, కుమారి 21ఎఫ్, ఈడోరకం ఆడోరకం’ కూడా మంచి విజ‌యం సాధించ‌డంతో ఉల్లాసంగా ఉత్సాహంగా క‌నిపిస్తున్నాడు. తాజాగా విడుదలైన ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’ సినిమా ప్రమోషన్ లో చెప్తూ… తాను సినిమా ద‌ర్శ‌కుడు అవుదామని ఈ రంగంలో అడుగు పెట్టాన‌ని, మ‌రో హీరో నాని కూడా అలాగే సినీరంగ ప్ర‌వేశం చేశాడ‌ని చెప్పాడు.

ADVERTISEMENT

ప్ర‌స్తుతం న‌టుడిగా బిజీగా ఉన్న‌ ఎప్పడో ఒక‌ప్పుడు డైరక్టర్‌ గా కూడా అవ‌తారం ఎత్తుతానేమో? అని రాజ్ తరుణ్ అన్నాడు. త‌న ముందుకు ఎంటర్ టైన్ మెంట్ సినిమాలే వ‌స్తున్నాయ‌ని, కుటుంబ క‌థ, రొమాన్స్ తో కూడిన సినిమాలు వంటి అన్నీ కలిసిన క‌థ‌లు త‌న ముందుకు వ‌చ్చినా సంతోష‌మేన‌ని అన్నాడు. కానీ అదే కావాలి అని మొండిగా కూర్చుంటే సినిమాలు చేయలేమ‌ని చెప్పాడు. ఇక త‌న పెళ్లి గురించి మాట్లాడుతూ… తాను 2019లో వివాహం చేసుకుంటాన‌ని అన్నాడు.

ADVERTISEMENT
Latest Stories