చాందిని చౌక్ లో క్రిష్, రాజమౌళి హల్చల్!

Rajamouli-Krish-partyingసెలబ్రేటీలు బయటకు వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. అందుకే పబ్లిక్ లైఫ్ లో చాలా అరుదుగా మాత్రమే వారు తారసపడుతుంటారు. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం దీనికి పూర్తి విరుద్ధం. వారికంటూ కొన్ని అడ్డాలను ఏర్పాటు చేసుకున్నారు. సమయం చిక్కితే వారంతా అక్కడ ప్రత్యక్షమై సందడి చేస్తూ ఉంటారు.

ఈ ఫోటోలో కనపడుతున్న దర్శకులు క్రిష్, రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డల పరిస్థితి ఇదే. చాందిని చౌక్ లో బాగా ఫేమస్ అయినటువంటి కరీం దాబాకు వచ్చి వారి ఆకలిని తీర్చుకుని వెళ్లారు. సోమవారం నాటి సాయంత్ర సమయంలో ఈ ముగ్గురు కలిసి చాందిని చౌక్ లో హల్చల్ చేస్తూ… ఒక సెల్ఫీని తీసుకుని సోషల్ మీడియాలో సందడి చేసారు. ఎంతటి సెలబ్రిటీలైనా వారికి కొన్ని కోరికలు ఉంటాయి కదా… అనడానికి నిదర్శనమే ఈ ఫోటో.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories