శశికళ, జగన్ లపై హల్చల్ చేస్తోన్న ‘సూపర్ స్టార్’ డైలాగ్!

Rajinkanth Dialogues On Sasikala And YS jagan - Copyతన ప్రతి సినిమాలో కనీసం ఒక్క సామెత అయినా చెప్పడం సూపర్ స్టార్ రజనీకాంత్ కున్న అలవాటు. అయితే రజనీ నటించిన ఓ సూపర్ హిట్ సినిమాలోని డైలాగ్, వర్తమాన రాజకీయాలను ప్రతిబింబించే విధంగా ఉండడంతో, సదరు డైలాగ్ తో సోషల్ మీడియా మారుమ్రోగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ కు అతి త్వరలో తానే ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్న వైసీపీ అధినేత జగన్, తమిళనాడులో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న శశికళను ఉద్దేశించి హల్చల్ చేస్తోన్న ఈ డైలాగ్, ప్రస్తుత రాజకీయాలకు అద్దం పడుతోంది.

సూపర్ స్టార్ నటించిన “నరసింహా” సినిమాలో హీరోయిన్ రమ్యకృష్ణతో… “అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు” అని రజనీకాంత్ చెప్పిన డైలాగ్, ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ముఖ్యమంత్రి పీఠం కోసం శశికళ పడుతున్న తిప్పలు అన్నిఇన్ని కావన్న సంగతి తెలిసిందే. అంతా సాఫీగా జరిగిపోతుందనుకున్న తరుణంలో… చిన్నమ్మకు చుక్కలు చూపెడుతున్న పన్నీర్ సెల్వంకు క్రమంగా మద్దతు పెరుగుతుండడంతో, ఏమీ పాలుపోనీ స్థితిలో తలపట్టుకోవడం శశికళ వంతయ్యింది.

ADVERTISEMENT

అలాగే ‘కాబోయే ముఖ్యమంత్రిని తానే, తన పట్ల సరిగా ప్రవర్తించండి, లేదంటే తానూ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరినీ గుర్తుపెట్టుకుంటాను, రివెంజ్ తీర్చుకుంటాను’ అన్న అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్న జగన్ తీరుకు కూడా ఈ డైలాగ్ సరిగ్గా సూట్ అవుతోంది. మరో పక్కన ఈడీ అటాచ్మెంట్లు కూడా సిద్ధం కావడంతో డోలాయమాన పరిస్థితులలో జగన్ ఉన్నారు. మరో విశేషం ఏమిటంటే… ఈ ఇద్దరూ కూడా కేవలం ముఖ్యమంత్రి పీఠంనే టార్గెట్ గా చేసుకుని రాజకీయాలు చేస్తున్నారు.

మరి రజనీ చెప్పిన సూక్తి ప్రకారం అయితే… వీరికి సుఖపడే యోగం లేదని తేలిపోయినట్లేగా..! అంటే ఈ ఇద్దరికీ ప్రజలు పట్టపగలే చుక్కలు చూపించడం ఖాయమన్న మాట!

ADVERTISEMENT
Latest Stories