‘సరైనోడు’ ఓ ఎమోషన్ చుట్టూ తిరుగుతుందని, యాక్షన్, రొమాన్స్, ఎంటర్ టైన్ మెంట్, మెలొడ్రామా అన్నీ కలగలసిన సినిమా ‘సరైనోడు’ అని, ఈ సినిమా ప్రతి ఒక్కరినీ అలరిస్తుందని, విలన్ పాత్రలో నటుడు ఆది అద్భుతంగా నటించాడని, చాలా స్టైల్ గా ఉంటాడని, బాబాయ్ పాత్రలో శ్రీకాంత్ నటించారని, అన్ని పాత్రలు చాలా అద్భుతంగా వచ్చాయని… “సరైనోడు” చిత్ర విశేషాలను చెప్పుకొచ్చింది రకుల్.
ఇప్పటివరకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన సినిమాలు వేరు, ‘సరైనోడు’ సినిమా వేరు అంటూ ప్రకటన చేసి అంచనాలు పెంచే ప్రయత్నం చేసింది. వరుసగా మెగా హీరోలతో చేయడం సంతోషాన్ని ఇస్తోందని, ‘సరైనోడు’ పూర్తయిన దరిమిలా, రామ్ చరణ్ తో ‘తనీఒరువన్’ రీమేక్ లో నటిస్తున్నానని, ఆపై సాయిధరమ్ తేజ్ తో కూడా నటిస్తున్నానని ఖరారు చేసింది. అలాగే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తో అవకాశం వస్తే మాత్రం వదులుకోనని స్పష్టం చేసింది.
ADVERTISEMENT
ADVERTISEMENT



