సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ టాప్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ అభిమానులను ఊరిస్తూ ఓ పోస్ట్ చేసింది. తన ఇంటిలో ఉన్న ఫ్రిడ్జ్ ను కొన్ని సెకన్ల పాటు వీడియో తీస్తూ… చాలా ఆసక్తికరమైన ప్రకటన రాబోతోంది? ఎవరైనా గెస్ చేస్తారా? అంటూ ఫ్యాన్స్ కు ఓ పజిల్ పెట్టింది. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోకు అభిమానుల నుండి స్పందన కూడా బానే వస్తోంది.
కొత్త ఇల్లు కొనుక్కున్నారా? ఆ ప్రకటనే ఇవ్వబోతున్నారా? అంటూ కొంతమంది అభిమానులు అడుగుతుండగా, కొత్త బాలీవుడ్ సినిమాకు సైన్ చేసారా? మరికొందరు రకుల్ ని అడుగుతున్నారు. బహుశా తన కొత్త సినిమాకు సంబంధించిన వార్త అయ్యుండొచ్చని చెప్తున్నా… ఫ్యాన్స్ ను ఇలా పజిల్ తో ఉత్సాహపరిచింది ఈ ముద్దుగుమ్మ. ఇంతకీ అంత ఆసక్తికరమైన వార్త ఏం చెప్తుందబ్బా?
ADVERTISEMENT
ADVERTISEMENT



