మహేష్ కొత్త సినిమాలో లేటెస్ట్ ‘ట్విస్ట్’

Mahesh Rakul Preet, Mahesh Rakul Preet Murugadoss Movie, Mahesh Babu Rakul Preet Singh Movie, Mahesh Rakul Preet Rumours, Mahesh Rakul Preet Heroine  ఈ నెల 29వ తేదీ నుండి సెట్స్ పైకి వెళ్ళబోతుందని ప్రచారం జరుగుతున్న మురుగదాస్ – మహేష్ బాబు కాంభినేషన్ మూవీలో లేటెస్ట్ గా ఓ కీలక మార్పు జరగబోతోందన్న టాక్ ఊపందుకుంది. ఈ సినిమాలో ప్రిన్స్ కు జతగా బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రాను ఎంపిక చేసారన్న వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. అధికారికంగా చిత్ర బృందం ఈ విషయాన్ని ఖరారు చేయనప్పటికీ, పరిణితి టాలీవుడ్ ఎంట్రీ ఖయమంటూ ప్రచారం జరిగింది.

అయితే తాజా సినీ వర్గాల సమాచారం మేరకు… పరిణితి చోప్రా స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ల్యాండ్ అయ్యిందంటూ సినీ వర్గాలలో సందడి చేస్తోన్న టాక్. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో గానీ, హీరోయిన్ ఎంపిక అంటూ మళ్ళీ షూటింగ్ ను వాయిదా వేసే పరిస్థితులు తలెత్తుతాయోమోనని ప్రిన్స్ అభిమానులలో నిరాశ నెలకొంది. అయితే మహేష్ సరసన పరిణితి కంటే రకుల్ ప్రీత్ సింగ్ బెటర్ చాయిస్ అన్న మాటలు కూడా వినపడుతున్నాయి. సంగీత దర్శకుడు పేరును ఖరారు చేసినట్లుగా దర్శకుడు మురుగదాస్ హీరోయిన్ పేరును కూడా ప్రకటన చేస్తే తప్ప, స్పష్టత వచ్చే అవకాశం లేదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories