వరుసగా పెద్ద సినిమాలలో నటిస్తూ టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్, మరో మూడు రోజుల్లో “విన్నర్” చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా… మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా రూపుదిద్దుకుంటున్న చిత్ర విశేషాలను కూడా చెప్పుకొచ్చారు రకుల్. ఈ సినిమాకు సంబంధించి తన పార్ట్ 50 శాతం పూర్తయ్యిందని, ఇంకా షూటింగ్ కొనసాగుతోందని చెప్పారు.
మహేష్ బాబు చాలా పంచువల్ గా ఉంటారని, ‘ఇంటిలిజెంట్ థ్రిల్లర్’గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నా పాత్ర చాలా ఫన్నీగా ఉంటుందని, నా లుక్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాకు సంబంధించి అటు మహేష్ గానీ, ఇటు దర్శకుడు మురుగదాస్ గానీ ప్రస్తావించకపోవడంతో, ఏ కొద్ది సమాచారం ఎవరు వెల్లడించినా, అది కాస్త హాట్ హాట్ గా హల్చల్ చేస్తోంది. గతంలో కాస్తో కూస్తో కమెడియన్ ప్రియదర్శన్ సమాచారం ఇవ్వగా, తాజాగా రకుల్ తెలిపింది.
అయితే తన పాత్ర వరకు ఇంకా 50 శాతం మిగిలి ఉందంటే, ఈ షెడ్యూల్ లో చిత్ర టాకీ పార్ట్ పూర్తి కాదన్న మాట. అంటే షూటింగ్ పూర్తిగా ముగియాలంటే ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతోంది. ప్రస్తుతం హల్చల్ చేస్తున్న సమాచారం మేరకు, జూన్ 23వ తేదీన ఈ సినిమా విడుదలకు ముహూర్తం పెట్టారు. మరి అప్పటికైనా సిద్ధం అవుతుందో లేదో అన్న అనుమానాలు రకుల్ ఇచ్చిన సమాచారంతో వ్యక్తమవుతున్నాయి.



