“భరత్ అనే నేను” సినిమాతో బాహ్య ప్రపంచంలోకి వచ్చిన మహేష్ బాబు – జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ ల కలయిక, నిరంతరం కొనసాగుతోంది. తాజాగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ ఈ ముగ్గురు స్టార్ హీరోలు కలిసారు. దానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
దర్శకుడు వంశీకి కూడా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. తారక్ తో ‘బృందావనం’ సినిమాను తీసిన వంశీ, రామ్ చరణ్ తో ‘ఎవడు’ లాంటి కమర్షియల్ మూవీని తెరకెక్కించారు. ఏది ఏమైనా ఈ ముగ్గురు స్టార్ హీరోలు రెగ్యులర్ గా కలిసి దర్శనమిస్తుండడం అభిమానుల్లో సంతోషం నింపుతోంది.
ADVERTISEMENT
[m9adh]
ADVERTISEMENT



