మహేష్ – చెర్రీలు కలిసి ఏం చేయబోతున్నారు?

Ram Charan - Mahesh Babu Multi Star Movieటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల మధ్య బంధం రోజురోజుకూ పెరుగుతోంది. ఇటీవలే వీరిద్దరూ తమ సతీమణులతో కలసి విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అలాగే ఆదివారం నాడు వీరిద్దరూ తమ ఫ్యామిలీతో కలసి పార్టీ చేసుకున్నారు. హైదరాబాదులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో మహేష్ బాబు భార్య నమ్రత పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

ఈ వేడుకకు రాంచరణ్ అతని భార్య ఉపాసనలు హాజరయ్యారు. వీరితో పాటు దర్శకులు కొరటాల శివ, మెహర్ రమేష్ లాంటి అతికొద్దిమంది మాత్రమే ఈ పార్టీకి వచ్చారు. అయితే మహేష్, చరణ్ ఇద్దరూ కలసి కొత్త బిజినెస్ ప్రారంభించబోతున్నారని, ఇద్దరూ కలసి హోటల్ బిజినెస్ లోకి అడుగుపెట్టబోతున్నారని, ఇప్పటికే దీనిపై సుదీర్ఘ చర్చలు జరిగాయని టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ADVERTISEMENT

నమ్రత, ఉపాసనల మధ్య ఉన్న స్నేహమే… మహేష్ – చరణ్ ల మధ్య స్నేహం బలపడటానికి కారణమని సినీవర్గాలు పేర్కొంటున్నాయి. సినిమాల పరంగా ఇద్దరి అభిమానుల నడుమ గట్టి విభేదాలు ఉండగా, తాజా పరిణామాలతో అభిమానుల మధ్య కూడా సయోధ్య ఏర్పడడం తధ్యం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇలాంటి వాతావరణం టాలీవుడ్ కు శుభపరిణామంగా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories