తాడేపల్లి వచ్చిన చిరంజీవి బృందంకు ఎదురైన అనుభవం గురించి స్వయంగా చంద్రబాబు కూడా ప్రస్తావించారంటే, ఈ విషయం రాజకీయంగా ఎంతటి ప్రాధాన్యతను దక్కించుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా జగన్ ప్రవర్తన సర్వత్రా హాట్ టాపిక్ కాగా, దీనిపై ఎవరి వాదనలు వారికున్నాయి.
సినీ ఇండస్ట్రీకి చంద్రబాబు రెడ్ కార్పెట్ చేసి అడిగిందల్లా చేసి పెట్టగా, చివరకు ఇండస్ట్రీలో చాలా మంది బాబుకు వ్యతిరేకంగా పని చేసారు గనుక, జగన్ చేసిన ఈ పరాభవం చంద్రబాబు విలువను తెలియజేసిందని చెప్తుండగా, అసలు జగన్ కు అత్యంత దయనీయంగా చిరంజీవి ఎందుకు దండం పెట్టారనే విషయం మాత్రం టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు చెప్పుకొచ్చారు.
చిరంజీవి ఏమి ఆలోచన తక్కువైన మనిషి కాదని, ఆయనకు అన్ని తెలుసని, ఆయన దండం పెట్టింది సమస్య పరిష్కరించడంతో పాటు, “నాయనా నేనే గొప్ప నటుడిని అనుకున్నా, నా కంటే గొప్ప నటుడుగా నువ్వున్నావయ్యా” అని దండం పెట్టుకుని బయటకు వచ్చారే తప్ప, ఆయన వేరేగా ఆలోచించి పెట్టిన దండం కాదు అంటూ శ్రీకాకుళం ఎంపీ వివరించారు.
రామ్మోహన్ నాయుడు అన్న ఈ వ్యాఖ్యలకు సోషల్ మీడియా నీరాజనాలు పలుకుతోంది. జగన్ పై వేసిన ఈ పంచ్ కు నెటిజన్లు మాత్రమే కాదు, ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో పక్కనే ఉన్న సహచరులు కూడా నవ్వులతో మునిగిపోయారు. ఎర్రన్నాయుడు తనయుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన రామ్మోహన్ నాయుడు మాటల తూటాలలో తండ్రిని తలపిస్తున్నారనేది పొలిటికల్ టాక్.



