ramana-dikshitulu

కాదేది వైసీపీ రాజకీయానికి అనర్హం అన్నట్టుగా జగన్ వేసిన రాజకీయ వ్యూహాలలో సాక్ష్యాత్తు ఆ ఏడు కొండలవాడు కూడా బంది కావాల్సి వచ్చింది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీ పార్టీని దెబ్బ కొట్టడానికి రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలను, వాటిలోని ముఖ్య నాయకులను జగన్ తన అధీనంలోకి తెచ్చుకున్నారు.

Also Read – పవన్ ఇచ్చేశారు… జగన్‌ పుచ్చుకుంటున్నారు!

ఇందులో టీటీడీ సంస్థను కూడా భాగం చేస్తూ ఏడు కొండల వాడి పింక్ డైమండ్ పోయిందని, తిరుమల కొండ మీద అక్రమ నిధుల తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని, శ్రీ వారి బంగారం మాయమవుతుందంటూ ఒక కల్పిత కథలను సృష్టించి ఆ నాటి టీడీపీ ప్రభుత్వం పైన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పైన విష ప్రచారం చేసారు అప్పటి టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు.

వైసీపీ నేతల ఉచ్చులో చిక్కుకుని ఏడు కొండలవాడిని కూడా రాజకీయాలలోకి లాక్కొచ్చారు రమణ దీక్షితులు. రోజుకోసారి మీడియా ముందుకు రావడం తిరుమల పవిత్ర ఇలా అయిపోయింది అలా అయిపోయింది అంటూ భక్తుల మనోభావాలతో రాజకీయం చేసిన ఈ అర్చకుని సేవలకు మెచ్చిన జగన్, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనకు కేసులను బహుమానంగా సమర్పించింది.

Also Read – చెప్పాల్సింది చెప్పేసి తూచ్ అంటే ఎలా బ్రహ్మాజీ?

వైసీపీ ప్రభుత్వం హయాంలో టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తో సహా టీటీడి నిర్వహణ మీద కూడా రమణదీక్షితులు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపగా రమణదీక్షితుల మీద చర్యలు తీసుకుంటూ ఆయన పైన కేసులు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. అయితే తన పైన గత ప్రభుత్వం పెట్టిన కేసులు ఇప్పటి ప్రభుత్వం ఎత్తివేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విన్నపాలు చేసుకుంటున్నారు దీక్షితులు.

గత ప్రభుత్వం తన పై పెట్టిన అక్రమ కేసుల కోసం గత ఐదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరిగి అలిసిపోయానని, ఇప్పటికైనా కొత్తగా ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం తన పై వైసీపీ పెట్టిన కేసులను లిస్ట్ అవుట్ చేసి తొలగించాలని, అలాగే శ్రీవారికి కైంకర్యాలు చేసుకునే అవకాశాన్ని తిరిగి కల్పించారంటూ తన సోషల్ మీడియా వేదికగా ఎవరి ఓటమి కోసం పింక్ డైమండ్ అంటూ కట్టకధలు సృష్టించారో వారినే వేడుకుంటున్నారు రమణ దీక్షితులు.

Also Read – తెలుగు రాష్ట్రాలను వెంటాడుతున్న వర్షాలు..!

సోషల్ మీడియాలో వైరల్ అయిన రమణ దీక్షితుల ఆడియో ను అడ్డుపెట్టుకుని ఆయన గతంలో జగన్ కు చేసిన మేలును కూడా పక్కన పెట్టి ఆయనను ప్రధాన అర్చకుని పదవి నుండి తొలగించి మరి ఆయన పై కేసులు పెట్టింది వైసీపీ ప్రభుత్వం. అధర్మం, అవినీతికి కాపుకాస్తే అది ఎప్పటికైనా ఖర్మ రూపంలో తిరిగి వస్తుందనేది రమణ దీక్షుతుల విషయంలో రుజువయ్యింది.

ఇలా దీక్షితులు పై వైసీపీ ప్రభుత్వం వేసిన నీలి నిందలు ఇప్పుడు పసుపు రంగుతో తుడుచుకోవాలి దీక్షితులు ఆశ పడుతున్నారు. మరి ఆయన ఆశ అత్యాశ అవుతుందో నిరాశగా మిగులుతుందో వేచి చూడాలి.