Ramoji Rao

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరు. ఈరోజు తెల్లవారుజామున 3.45 గంటలకు హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు.

రామోజీరావుగా తెలుగు ప్రజలకు సుపరిచితులైన పూర్తిపేరు చెరుకూరి రామోజీ రావు. ఆయన 1936, నవంబర్‌ 16న కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించారు.

Also Read – కోడి కత్తి కేసు కూడా ఇలా బెడిసి కొట్టిందే!

1970 దశకంలో కూడా ముద్రించిన దినపత్రికలు ఒకటి రెండు రోజుల తర్వాత ప్రజల చేతికి అందుతుండటం చూసి ప్రతీరోజూ తెల్లవారుజామునే ప్రజలకు దినపత్రికలు ఎందుకు అందించలేము? అనే ఆలోచనతో 1974, ఆగస్ట్ 10వ తేదీన విశాఖపట్నంలో ఈనాడు దినపత్రికని స్థాపించారు.

అప్పట్లో పత్రికా రంగంలో అదో పెద్ద సంచలనం సృష్టించింది. కేవలం నాలుగేళ్లలోనే ఈనాడు పత్రిక అత్యంత జనాధారణ పొంది ప్రతీ ఇంట్లో కనబడుతుండేది. ఇది పత్రికారంగం ఆలోచనా దృక్పదాన్నే సమూలంగా మార్చివేసింది. అప్పటి నుంచే అన్ని ఇంగ్లీష్, తెలుగు దినపత్రికలు రాష్ట్రంలో ప్రింటింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకొని తాజా వార్తలతో పత్రికలు ప్రజలకు అందించడం మొదలుపెట్టాయి.

Also Read – విశాఖకు మెట్రో… భారం అవుతుందేమో?

ఆ తర్వాత ఈనాడు ‘లోకల్ ఎడిషన్’ మరో సంచలనం సృష్టించింది. అంతవరకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వార్తలు మాత్రమే పత్రికలలో కనిపించేవి. కానీ లోకల్ ఎడిషన్ ద్వారా ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబందించిన వార్తలు వస్తుండటంతో తెలుగు ప్రజలు ఈనాడుని అక్కున చేర్చుకున్నారు.

ఆ తర్వాత సినిమా వార్తలను అందించే ‘సితార’ పత్రికతో రామోజీరావు మరో సంచలనం సృష్టించారు. ఆ తర్వాత విపుల, చతుర అనే మరో రెండు విభిన్నమైన మాసపత్రికలతో రామోజీరావు సాహిత్య రంగానికి ఎనలేని సేవ చేశారు.

Also Read – రాజకీయ షల్టర్ కావలెను..!

ఈనాడు ప్రారంభించిన సమయంలోనే విశాఖ నగరానికి ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని రామోజీరావు గ్రహించారు. అప్పుడే విశాఖలో డాల్ఫిన్ స్టార్ హోటల్‌ నిర్మించారు.

ఆ తర్వాత రామోజీరావు ప్రవేశించని రంగం లేదు సాధించని విజయం లేదన్నట్లు ఆయన ప్రస్థానం సాగింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ స్థాపించి సామాన్య, మద్యతరగతి ప్రజల కష్టార్జితానికి భద్రతతో పాటు లాభాలు ఆర్జించి పెట్టి అత్యంత నమ్మకాన్ని పొందారు.

ప్రియా పికిల్స్ పేరుతో తెలుగు ప్రజలకు నోరూరించే నాణ్యమైన పచ్చళ్లు అందించారు. దేశ విదేశాలలో ఉన్న తెలుగు ప్రజలు వాటిని అమృతంగా భావించి ఆదరించడంతో ఆ వ్యాపారంలోనూ రామోజీరావు విజయం సాధించారు.

ఆ తర్వాత ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ఏర్పాటు చేసి సినీ నిర్మాణంలో ప్రవేశించి అనేక సూపర్ హిట్ సినిమాలు అందించారు. వాటితో అనేక అవార్డులు అందుకున్నారు. సినీ రంగంలో ప్రవేశించినప్పుడు నిర్మాతలు సినిమా షూటింగ్‌లు చేసుకునేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన రామోజీరావు హైదరాబాద్‌లో సకల సౌకర్యాలతో రామోజీ ఫిలిమ్ సిటీని నిర్మించారు. అది నేటికీ దేశంలో అత్యుత్తమ ఫిలిమ్ స్టూడియోగా నిలుస్తోంది.

పత్రికా రంగం, సినీ రంగంలో సంపాదించిన అనుభవంతో ఈనాడు ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్‌ ఛానల్ ఏర్పాటు చేశారు. ఈనాడు పత్రికని తెలుగు ప్రజలు ఎంతగా ఆదరించారో ఈనాడు న్యూస్ ఛానల్‌ని కూడా అంతగా ఆదరించారు.

మీడియా రంగంలో ఉండటంతో రాజకీయాలపై కూడా రామోజీరావు దృష్టి సారించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నందమూరి తారక రామరావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు రామోజీరావు తెలుగు దేశం పార్టీ ఆశయాలను, అవసరాన్ని గుర్తించి ఎన్టీఆర్‌కు బాసటగా నిలిచి టిడిపి గెలుపుకి దోహదపడ్డారు.

ఎన్టీఆర్‌ తర్వాత టిడిపి పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్షాలు వాటి మీడియా బురద జల్లుతున్నప్పుడు, రాష్ట్రానికి ఆయన వంటి ఓ దార్శనికుడు అవసరమని భావించిన రామోజీరావు ఆయనకు బాసటగా నిలిచి టిడిపి గెలుపుకి దోహదపడ్డారు.

సమైక్య రాష్ట్రంలో, రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలను పాలించిన రాజకీయ పార్టీల తీరుతెన్నులపై ఈనాడు మీడియాలో ఎప్పటికప్పుడు జరిగే పరిణామాలకు సంబందించి వార్తలు, నిశితమైన రాజకీయ విశ్లేషణలు చేస్తూ అధికారంలో ఉన్న పార్టీలపై అక్షరాలనే అంకుశంగా మార్చుకొని అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేశారు.

గత 5 ఏళ్ళలో జగన్‌ ప్రభుత్వం ధాటికి రాష్ట్రంలో ప్రతిపక్షాలు విలవిలాడుతుంటే రామోజీరావు చాలా ధైర్యంగా ప్రతిపక్ష బాధ్యతలు చేప్పట్టి తన ఈనాడు మీడియా ద్వారా జగన్‌ ప్రభుత్వం చేసిన అరాచకాలను, అకృత్యాలను, దోపిడీ, అవినీతి, అనాలోచిత నిర్ణయాలను, అసమర్ద పాలనను ఎండగట్టారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జగన్‌ రాక్షస పాలన అంతం ఓడించడానికి టిడిపి, జనసేన, బీజేపీ కూటమి చేస్తున్న పోరాటాలకు బాసటగా నిలిచి అవి అపూర్వమైన విజయం సాధించేందుకు ఎంతగానో తోడ్పడ్డారు.

టిడిపి కూటమి విజయాన్ని చూసిన తర్వాత తాను ఈ లోకానికి వచ్చిన పని పూర్తయిందన్నట్లు తృప్తిగా ఇక సెలవు అంటూ వెళ్ళిపోయారు ధన్యజీవి రామోజీ రావు.