హాస్పిటల్ లో చేరిన ‘ఈనాడు’ రామోజీరావు!

ramoji-rao-yashoda-hospitalఉషాకిరణ్ మూవీస్ అధినేత, ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు తీవ్ర అస్వ‌స్థ‌తతో ఆస్ప‌త్రిలో చేరారు. వెన్నునొప్పు, వైర‌ల్ ఫీవ‌ర్‌, ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్న రామోజీ, సోమ‌వారం సోమాజీగూడ‌లోని య‌శోద ఆస్ప‌త్రిలో చేరారు. సీనియ‌ర్ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉన్న రామోజీ, ప్ర‌స్తుతం కోలుకుంటున్నార‌ని, బుధ‌వారం కొద్దిగా ఆహారం కూడా తీసుకున్నార‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాలు తెలిపాయి.

సీనియ‌ర్ జనరల్ ఫిజీషియ‌న్ డాక్ట‌ర్ ఏమ్వీ రావు, ప‌ల్మ‌నాల‌జిస్ట్ డాక్ట‌ర్ న‌వనీత్‌ సాగ‌ర్ బృందం రామోజీరావుకు చికిత్స అందిస్తున్న‌ట్టు పేర్కొన్నాయి. గత రెండు రోజుల నుండి ఈనాడు అధినేత కోలుకున్న తీరుతో మరో ఒకటి, రెండు రోజుల్లో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కావచ్చని సమాచారం. ఇటీవల కాలంలో సినీ నిర్మాణాలకు పూర్తిగా దూరంగా ఉంటున్న రామోజీ, కేవలం పేపర్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వైపుకే దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories