ys_jagan_mohanreddy

ఆడవారి కన్నీటికి రాజ్యాలే కూలిపోయాయి అనేది పురాణాల చరిత్ర చెప్పినప్పటికీ వాస్తవ రూపంలో అది ఎంత వరకు ఫలితాలనిస్తుంది అనుకున్న వారికీ వైసీపీ ఓటమే తార్కాణంగా నిలిచింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలు కన్నీటితో రోజులు లెక్కపెట్టారు అనేదానికి రాజధాని రైతులే సాక్ష్యాలు.

ఒక ప్రభుత్వాన్ని నమ్మి 33 వేల ఎకరాల వ్యవసాయ భూమిని రాజధాని నిర్మాణానికి త్యాగం చేసిన రైతులను వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మానసికంగా వేధిస్తూనే ఉంది. రాష్ట్రానికి ఒక్క రాజధాని సరిపోదు మూడు కావాలి అంటూ మొదలుపెట్టిన జగన్, ఐదేళ్ల పాటు వారి కుటుంబాల కన్నీటితో విశాఖ ఋషి కొండ మీద ప్యాలస్ నిర్మించుకున్నారు.

Also Read – వైసీపీకి టీడీపీ పెర్‌ఫెక్ట్ సమాధానాలు… బావున్నాయి!

అయితే 2024 లో మరోసారి గెలిచి ముఖ్యమంత్రిగా ఋషి కొండ మీద అడుగు పెట్టాలని చూసిన జగన్ కు అమరావతి రైతుల ఉసురు తగిలిందని అందుకే ఏంతో ఇష్టంగా కట్టుకున్న రుషికొండ నిర్మాణాలలో జగన్ కనీసం అడుగు కూడా పెట్టలేక పోయారని చెవులు కోరుకుంటున్నారు విశాఖ వాసులు.

ఇసుక పాలిసీ మార్పుతో భవన నిర్మాణ కార్మికుల ఉపాధి మీద కొట్టి ఎంతోమంది ఆకలి చావులకు జగన్ ప్రభుత్వం కారణమయ్యింది. అలాగే ప్రతిపక్ష పార్టీలలోని మహిళలను, ఆ పార్టీ నాయకుల అర్ధాంగులను అత్యంత నీచంగా కించపరుస్తూ అవమానించిన జగన్ కు వారి ఉసురు తగిలే సొంత కుటుంబంలోని తల్లి చెల్లి కూడా బద్ద శత్రువులయ్యారు అనే టాక్ కూడా నడుస్తుంది.

Also Read – వంశీ జైలుకి… వైసీపీ కార్యకర్తలు సైలంట్?

అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అంచలంచలుగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఇచ్చిన హామీని పక్కన పెట్టి నాసిరకమైన మద్యంతో వ్యాపారం మొదలుపెట్టింది వైసీపీ ప్రభుత్వం.ప్రభుత్వం అమ్మిన కల్తీ మద్యం తాగి ఈ ఐదేళ్లలో ఎన్నో వేలమంది అనారోగ్యం పాలయ్యారు. అలాగే కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇలా కల్తీ మద్యంతో ఎన్నో కుటుంబాలలో అక్క చెల్లమ్మల పసుపుకుంకుమలు పోగొట్టి, ఆ కుటుంబంలోని పిల్లలను అనాథలను చేస్తూ ఆ కుటుంబాల ఉసురు తీసుకుంది జగన్ ప్రభుత్వం. కరోనా సమయంలో మాస్క్ లు అడిగిన పాపానికి సుధాకర్ అనే ఒక డాక్టర్ ను పిచ్చోడిని చేసి ఆయన నిండు ప్రాణాలను బలి తీసుకుంది జగన్ సర్కార్. తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించిన 15 ఏళ్ళ అమర్నాధ్ అనే పిల్లాడిని పెట్రోల్ పోసి నిప్పటించి ఆ కుటుంబం ఉసురు తీసిన పాపం ఎవరిదీ.?

Also Read – కర్నూలు హైకోర్టు బెంచ్‌కి తొలి విగ్నం.. వాళ్ళేనా?

ఒక వ్యక్తిని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసి ఆ కుటుంబాన్ని రోడ్డు కీడ్చిందెవరు.? గడిచిన ఐదేళ్ల నుంచి తన తండ్రి హత్యకు న్యాయం కావాలి అంటూ కాళ్లరిగేలా తిరిగిన సునీత కుటుంబాన్ని విమర్శలతో వేదించిందెవరు..? వ్యవస్థలను అడ్డుపెట్టుకుని అధికారులను స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ రాష్ట్రంలో వైసీపీ చేసిన విధ్వంసానికి బాధ్యత ఎవరిదీ.? ఈ కుటుంబాల ఐదేళ్ల కన్నీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వానిదే. ఇలా ఏంతో మంది కన్నీటి ఉసురుతో జగన్ ప్రభుత్వం 2024 ఎన్నికలలో 151 సీట్ల నుండి 11 సీట్లకు కుప్పకూలింది.