Redivision of Contituencies

రాష్ట్రాలు, జిల్లాల పునర్విభజనతోనే ఏర్పడిన సమస్యలు, వివాదాలే ఇంతవరకు పరిష్కారం కాలేదు. ఇప్పుడు జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది.

ఎక్కువ లోతుకి వెళ్ళకుండా ఈ ప్రతిపాదనని పైపైనుంచి చూస్తే సహేతుకంగానే కనిపిస్తుంది. కానీ దీంతో జనాభా తక్కువ ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలో ప్రాతినిధ్యం తగ్గిపోతుంది.

Also Read – పవన్ లక్ష్యం గురి తప్పిందా.? గురి తప్పిస్తున్నారా.?

దక్షిణాది కంటే ఉత్తరాది రాష్ట్రాలలో నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నందునే జాతీయ రాజకీయాలలో దశాబ్ధాలుగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పార్టీలు, వాటి నేతల పెత్తనమే కొనసాగుతోంది.

ఇప్పుడు జనాభా ఆధారంగా నియోజకవర్గాలు పునర్విభజన చేసినట్లయితే ఉత్తరాది రాష్ట్రాలకు మరిన్ని ఎంపీ సీట్లు పెరుగుతాయి. కనుక పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యత తగ్గుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..

ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో గత 4-5 దశాబ్ధాలలో కుటుంబ నియంత్రణ బాగా జరిగింది. అందువల్ల గణనీయంగా జనాభా తగ్గింది. కానీ ఉత్తరాది రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ పాటించకపోవడం వలన జనాభా విపరీతంగా పెరిగింది.

కనుక జనాభా పరిగణనలోకి తీసుకొని నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఉత్తరాది రాష్ట్రాలలో ఒక్క యూపీ, బిహార్‌ రెండు రాష్ట్రాలకే ఏకంగా 222 ఎంపీ సీట్లు వస్థాయి. కానీ దక్షిణాదిన అన్ని రాష్ట్రాలకు కలిపి కేవలం 165 సీట్లు మాత్రమే లభిస్తాయి!

Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?


దేశాభివృద్ధిలో, జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు కీలకపాత్ర పోషిస్తే అందుకు బహుమానంగా ఈవిదంగా శిక్షిస్తారా? ఇదెక్కడి న్యాయం?అని స్టాలిన్ ప్రశ్నించారు. కనుక ఈ ప్రతిపాదనతో ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మద్య అంతరం మరింత పెరిగిపోకుండా ఉండేందుకు దీనికి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఎలా?