
ఒక్కోసారి కాకతాళీయంగా కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. అటువంటిదే ఇది కూడా. జగన్ హయంలో చంద్రబాబు నాయుడుపై పెట్టిన అక్రమ కేసులపై ఏసీబీ పారదర్శకంగా విచారణ జరుపడం లేదు కనుక వాటిని సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ బాలయ్య అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన వెనుక వైసీపీ ఉంటుందని వేరే చెప్పక్కరలేదు. కానీ సుప్రీంకోర్టు పిటిషనర్ తరపు న్యాయవాదికి చివాట్లు పెట్టి ఆ కేసుని కొట్టేసింది.
ఇదేవిదంగా జగన్ ఆక్రమస్థుల కేసులపై ఏళ్ళ తరబడి విచారణ సాగుతున్నా పూర్తవడంలేదని, కనుక ఆ కేసులను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఏపీ ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు గతంలో సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ వేశారు.
Also Read – విశ్వసనీయత అంటే సంక్షేమ పధకాలు అమలుచేయడమేనా?
ఆ కేసుల విచారణకు జగన్ ఏనాడూ హాజరుకాలేదని, ఆ కేసుల విచారణ పూర్తవకుండా అడ్డుపడుతున్నారని, కనుక జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణరాజు కోరారు.
దానిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ఈ కేసులను ఏ జమ్ము కశ్మీర్‌కో బదిలీ చేస్తే విచారణ మరింత ఆలస్యం అవుతుందే తప్ప తొందరగా ముగియదు కదా?జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘించిన్నట్లు కానీ, ఈ కేసు విచారణ ప్రభావితం చేస్తున్నట్లు గానీ ఎటువంటి ఆధారాలు లేవంటూ రఘురామ కృష్ణరాజు పిటిషన్‌ని కూడా కొట్టివేసింది.
Also Read – విలువలు, విశ్వసనీయత పోటీలు: రేసులో ఇద్దరే
దీంతో సిఎం చంద్రబాబు నాయుడుకి, మాజీ సిఎం జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఒకేసారి ఉపశమనం లభించిన్నట్లయింది. ముఖ్యమంత్రికి, ప్రధాన ప్రతిపక్షనేతకి ఒకేసారి, ఒకే కోర్టులో ఉపశమనం లభించడం కాకతాళీయమే కానీ ఆశ్చర్యంగా ఉంది కదా?
ఇదివరకు సుప్రీంకోర్టు స్వయంగా ఈ అక్రమాస్థుల కేసులు ఇంకా ఎన్నేళ్ళు విచారణ జరుపుతారంటూ సీబీఐ, ఈడీలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, 2024 జూలై నెలాఖరులోగా ముగించాలని ఆదేశించింది.
కానీ ఇప్పుడు అదే సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుతో ఈ కేసులు మరో రెండు దశాబ్ధాలు సాగినా పర్వాలేదని చెప్పిన్నట్లే అనిపిస్తుంది.
కనుక ఈ కేసులలో ఏ1, ఏ2లుగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి సుప్రీంకోర్టు తీర్పు చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఇక వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. జగన్ హాయిగా రాజకీయాలు, విజయసాయి రెడ్డి వ్యవసాయం చేసుకోవచ్చు.