విజయవాడ, పటమటలో అద్దె ఇంటిని తీసుకున్న పవన్ కళ్యాణ్, తన పెద్ద కొడుకు అకీరాతో కలిసి గృహప్రవేశం చేయడం హాట్ టాపిక్ అయ్యింది. సినిమాలు వదిలేసి రాజకీయాలు చేస్తోన్న పవన్ కళ్యాణ్, సడెన్ గా కొడుకుని వెంటపెట్టుకు రావడంపై రకరకాల కధనాలు వినిపించాయి. ముఖ్యంగా పవన్ వద్దకు అకీరా వచ్చేసాడేమోనని అభిమానులంతా సోషల్ మీడియాలో రేణుదేశాయ్ ని ప్రశ్నిస్తున్నారు.
ఈ తాకిడిని తట్టుకోలేని రేణు దీనిపై వివరణ ఇచ్చుకుంది. ప్రస్తుతం వేసవికాలం సెలవులు కావడంతో, తండ్రితో గడిపేందుకు పవన్ వద్దకు అకీరా వచ్చాడని, అంతేతప్ప అకీరా హైదరాబాద్ కు పర్మినెంట్ గా షిఫ్ట్ కాలేదని రేణుదేశాయ్ వివరణ ఇచ్చుకుంది. సోషల్ మీడియాలో వస్తోన్న సందేశాలకు, ప్రశ్నలకు జవాబుగా ఈ క్లారిటీ ఇస్తున్నానని స్పష్టం చేసింది. పవన్ సినీ వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవడానికి వస్తున్నాడేమోనని భావించిన ఫ్యాన్స్ కు ఈ వార్త నిరాశ కలిగిస్తోంది.



