పవన్ ఫ్యాన్స్ తో భయం వలనే?

Official-Pawan-Kalyan-Ex-Wife-Renu-Desai-Engagedపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ మరో వివాహం చేసుకోబోతుందన్న విషయం తెలిసిందే. ఎంగేజ్మెంట్ పూర్తయ్యిందంటూ అధికారికంగా ఫోటోలను విడుదల చేసిన రేణు, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మాత్రం పూర్తిగా చూపించలేదు. నిశ్చితార్ధం కూడా జరిగిపోయిన తర్వాత ఆ వ్యక్తిని ఎందుకు చూపించలేదు? అంటే పవన్ కళ్యాణ్ అభిమానుల వలనే అన్న టాక్ సర్వత్రా వినపడుతోంది.

తనకు ఓ తోడు కావాలి, తన పిల్లలకు ఓ అండ కావాలి… అందుకే తాను రెండో వివాహం చేసుకుంటానంటూ రేణు గతంలోనే ప్రకటించింది. అయితే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి తీవ్రమైన స్పందనలు వచ్చాయి. ‘మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలిస్తే, వారిని చంపేస్తామంటూ’ కూడా హెచ్చరికలు వచ్చాయి. సదరు సంగతులన్నీ స్వయంగా రేణునే ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

ADVERTISEMENT

దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల తీరుతో ఏర్పడిన భయం వలనే, తన కాబోయే శ్రీవారి ఫోటోను బయటపెట్టలేదనే టాక్ బలపడింది. తాజా నిశ్చితార్ధ ఫోటోలపై కూడా పవన్ అభిమానుల నుండి భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి. పరిపక్వత కలిగిన వారు దీనిని ఆహ్వానిస్తూ అభినందనలు తెలుపగా, మరికొందరు మాత్రం పవన్ పై ఉన్న అభిమానంతో రేణును విమర్శిస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా తెలియాల్సిన విషయమే కదా… రిలీజ్ చేస్తే తప్పేంటి… అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT
Latest Stories