
వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్స్ చాలా సున్నితమైన అంశమే. కానీ దేశంలో రాజకీయ పార్టీలు వాటినే ఓ అస్త్రంగా ప్రత్యర్ధులపై ప్రయోగిస్తుంటాయి. అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని రాజ్యాంగం చెపుతోంది.
80,000 పుస్తకాలు చదివిన మహా మేధావి కేసీఆర్‌కి ఈ విషయం తెలిసి ఉన్నా గిరిజనులకు, ముస్లింలకు అదనంగా రిజర్వేషన్స్ కల్పిస్తానంటూ శాసనసభలో తీర్మానం చేసి దానిని పోస్టు బాక్సులో పడేసి ఢిల్లీకి పంపేశారు.
Also Read – జీఎస్టీ ఆదాయం తగ్గితే.. సిగ్గు పడాల్సింది బాబు కాదు.. జగనే!
దానిని కేంద్రం ఆమోదించదని ఆయనకు ముందే తెలుసు. కానీ ‘నేను మైనార్టీలకు రిజర్వేషన్స్ శాతం పెంచాలని తాపత్రయపడుతుంటే కేంద్రం అడ్డుపడిందని’ చెప్పుకొని ముస్లిం ఓట్లు నొల్లుకునేందుకు ప్రయత్నించారు.
ఆర్ కృష్ణయ్య బీసీల కోసం, ముద్రగడ పద్మనాభ రెడ్డి కాపుల హక్కులు, రిజర్వేషన్స్ కోసం చాలా పోరాటాలు చేశారు. మొదట్లో ఇద్దరూ చాలా నిబద్దతతోనే పోరాడేవారు.
Also Read – ఈ ఐదేళ్ల వడ్డీ కాదు గత ఐదేళ్ల వడ్డీ సంగతేంటి.?
కానీ ఆ పోరాటాలతో బీసీలు, కాపులకు ఏమైనా ప్రయోజనం కలిగిందో లేదో తెలీదు కానీ వారిరువురూ బలమైన ఓటు బ్యాంక్ చేతిలో ఉన్న నేతలుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. దాంతో ఆర్ కృష్ణయ్య వరుసగా రెండుసార్లు రాజ్యసభ సీటు సంపాదించుకున్నారు. అంటే బీసీలందరికీ న్యాయం జరిగిపోయిందనుకోవాలా?
ఏపీలో బాలమైన కాపు ఓటు బ్యాంక్ కోసం, కూటమి నుంచి కాపులను వేరు చేయడం కోసం, ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ని చావు దెబ్బ తీయడం కోసం జగన్ ముద్రగడని ఉపయోగించుకున్నారు. ఒకవేళ వైసీపీ మళ్ళీ గెలిచి అధికారంలోకి వచ్చి ఉంటే ముద్రగడకు మంచి పదవే దక్కేది. కానీ దురదృష్టం కొద్దీ ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడంతో ఏ పదవులు దక్కలేదు.
Also Read – ఏపీలో క్రూజ్ పర్యాటకం త్వరలో..
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నా బీసీలు, నా ఎస్సీలు.. నా ఎస్టీలు.. నా మైనార్టీలు అంటూ కూనిరాగాలు తీస్తుండేవారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలకి ఉప ముఖ్యమంత్రి, మంత్రి పదవులు ఇచ్చారు కూడా.
కానీ తమకు పార్టీలో, ప్రభుత్వంలో ఎటువంటి గౌరవమర్యాదలు, ప్రాధాన్యత ఉండేది కాదని, కేవలం తమని ప్రజలకు చూపించి ఓట్లు దండుకునేందుకు జగన్ ప్రయత్నించేవారని పార్టీని వీడివచ్చిన నేతలే చెప్పుకున్నారు.
కానీ చిత్తశుద్ధి ఉంటే బడుగు బలహీనవర్గాలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే వారికి సముచిత ప్రాధాన్యం కూడా ఈయవచ్చని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి నిరూపించి చూపబోతున్నారు.
చట్ట సభలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ కల్పించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపగలమని కానీ దాని కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని, అది సాధ్యం కాదు కనుక త్వరలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం సీట్లు బీసీలకు కేటాయిస్తామని నిన్న శాసనసభలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీజేపి, బిఆర్ఎస్ పార్టీలకు దమ్ము, చిత్తశుద్ధి ఉంటే అవి కూడా 42 శాతం సీట్లు బీసీలకు కేటాయించాలని రేవంత్ రెడ్డి సవాలు చేశారు.
కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత చట్ట సభలలో మహిళలకు 35 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీలో ఓసారి దీక్ష చేశారు. కానీ ఆ తర్వాత మళ్ళీ ఆమె ఆ ఊసే ఎత్తలేదు. కానీ ఆమెకు, కేసీఆర్‌కి చిత్తశుద్ధి ఉండి ఉంటే ఈవిదంగా బిఆర్ఎస్ పార్టీ పరంగా నిర్ణయం తీసుకొని మహిళలకు 35 శాతం సీట్లు కేటాయించవచ్చు కదా?
కానీ కేసీఆర్ ఓట్లు, సీట్లు లెక్కలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు కనుక మహిళలకు 35 శాతం సీట్లు ఇవ్వాలనే ఆలోచన కూడా చేయలేదు.
బడుగు బలహీన వర్గాల అభ్యునతి కోసం ఏర్పాటు చేసిన రిజర్వేషన్స్‌ని సమాజంలో ఆయా వర్గాల ప్రజలు పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నా, రాజకీయ పార్టీలు వాటిని ఏవిదంగా వాడేసుకుంటున్నాయో అర్దం చేసుకునేందుకే ఈ ఉదాహరణలు.